News April 4, 2025
బాబు వచ్చాక ఆదాయం తగ్గింది: వైసీపీ

AP: చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖ నేల చూపులు చూస్తోందని వైసీపీ విమర్శించింది. ‘జగన్ హయాంతో పోలిస్తే నేడు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. 2023-24లో రూ.9,600కోట్లు రాగా, 2024-25లో రూ.8,800కోట్లకు పడిపోయింది. అది రాబట్టడానికి అధికారులు అష్టకష్టాలు పడ్డారు’ అని ట్వీట్ చేసింది.
Similar News
News April 11, 2025
మాజీ ప్రియురాలిపై యువకుడి విచిత్ర ప్రతీకారం!

కోల్‌కతాలోని లేక్‌టౌన్ ప్రాంతంలో సుమన్ సిక్దర్ అనే యువకుడు మాజీ గర్ల్‌ఫ్రెండ్‌పై విచిత్రంగా ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. తనకు బ్రేకప్ చెప్పిందన్న కోపంతో 4 నెలల వ్యవధిలో 300కు పైగా క్యాష్ ఆన్ డెలివరీ పార్సిల్స్‌ను ఆమె ఇంటికి బుక్ చేశాడు. ఆ డెలివరీలు తనకెందుకు వస్తున్నాయో తెలియక తీవ్ర ఒత్తిడికి గురైన యువతి పోలీసుల్ని ఆశ్రయించగా అసలు విషయం వెలుగుచూసింది. దీంతో సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
News April 11, 2025
వేసవిలో వాకింగ్.. ఎప్పుడు చేయాలంటే..

వాకింగ్ అలవాటున్నవారికి వేసవిలో వేడిమి సమస్యగా ఉంటుంది. వారు ఆలస్యంగా లేచి వాకింగ్ చేయడం మంచిదికాదని జీవనశైలి నిపుణులు పేర్కొంటున్నారు. ‘సమ్మర్లో ఉదయం 7.30 గంటల్లోపు వాకింగ్ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత సూర్యుడి తీవ్రత పెరుగుతుంటుంది. అది ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ఉదయం 10 గంటలు దాటాక, సాయంత్రం 5 గంటలలోపు ఆరుబయట వ్యాయామం, వాకింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు’ అని సూచిస్తున్నారు.
News April 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.