News October 13, 2025

ఆదాయం తగ్గింది.. కేంద్ర మంత్రి పదవి వద్దు: సురేశ్ గోపి

image

కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు మలయాళ నటుడు సురేశ్ గోపి చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. పెట్రోలియం శాఖ సహాయమంత్రిగా ఉన్న ఆయన నిన్న BJP కార్యకర్తలతో మాట్లాడుతూ మనసులోని మాటను బయటపెట్టారు. ఆదాయం తగ్గడంతో మళ్లీ సినిమాల్లో నటించాలని ఉందని చెప్పారు. సినీ కెరీర్ వదిలిపెట్టాలని తాను ఎన్నడూ కోరుకోలేదన్నారు. తన పదవి కేరళకే చెందిన MP సదానందన్ మాస్టర్‌కు ఇవ్వాలని సూచించారు.

Similar News

News October 13, 2025

రూ.2లక్షలకు చేరువలో కిలో వెండి

image

కిలో వెండి ధర రూ.2లక్షల వైపు దూసుకెళ్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కేజీపై ఏకంగా రూ.5వేలు పెరిగి రూ.1,95,000గా ఉంది. అటు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.320 పెరిగి రూ.1,24,540కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రేటు రూ.300 పెరిగి రూ.1,14,950 పలుకుతోంది.

News October 13, 2025

మందుకు మందు వేయాల్సిందే!

image

కష్టాలేవైనా మందు తాగడమే వాటికి మందు అని కొందరి మాట. కానీ ఏపీలో మాత్రం తాగితే కొత్త కష్టాలు వచ్చేలా ఆల్కహాల్ ఉంటోంది. తాజా నకిలీ మద్యం బాగోతంతో తాము తాగేది స్వచ్ఛమైన ఆల్కహాలేనా? అని అనుమానంతోనే ఖజానా పోషకులు గ్లాసు నింపుతున్నారు. మద్యం పారకుంటే ప్రభుత్వాలు నడవలేని స్థితిలో.. కల్తీ అటు ప్రజలను, ఇటు ప్రభుత్వ ఆదాయాన్ని కబళిస్తోంది. ఈ మహమ్మారికి మందు వేసి బాగు చేయాలనేది ప్రతి ఒక్కరి డిమాండ్.

News October 13, 2025

ట్రంప్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం

image

US అధ్యక్షుడు ట్రంప్‌కు ఇజ్రాయెల్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ హానర్’ను ఇవ్వనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ వెల్లడించారు. యుద్ధాన్ని ముగించడంలో సాయం చేసినందుకు, బందీల విడుదలకు చేసిన కృషికి ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. సెక్యూరిటీ, సహకారం, శాంతియుత భవిష్యత్తు కోసం మిడిల్ ఈస్ట్‌లో ఆయన కొత్త శకానికి నాంది పలికారని కొనియాడారు.