News August 29, 2024
రూ.10 వేల కోట్ల ఆదాయం: ముకేశ్ అంబానీ

వయాకామ్ 18 నెట్వర్క్ TV ఛానల్స్ సహా జియో సినిమా, స్పోర్ట్స్ ద్వారా తమ మీడియా వ్యాపార ఆదాయం రూ.10 వేల కోట్లకు చేరుకున్నట్టు ముకేశ్ అంబానీ తెలిపారు. 62% వృద్ధిని సాధించినట్టు తెలిపారు. జియోసినిమా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, IPL రెండో సీజన్‌ను 62 కోట్ల మంది వీక్షించడం ద్వారా ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన లైవ్ ఈవెంట్‌గా నిలిచిందని తెలిపారు. ఒలింపిక్స్‌కు మంచి ఆదరణ లభించిందన్నారు.
Similar News
News October 14, 2025
ఎల్లో అలర్ట్: కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో కాసేపట్లో HYD, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గాలి వేగం గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News October 14, 2025
ఫిట్నెస్, ఫామ్ ఉంటేనే WC జట్టులో RO-KO: రవిశాస్త్రి

2027 WCలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అది వారి హంగర్, ఫిట్నెస్, ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. AUSతో వన్డే సిరీస్ పూర్తయ్యేలోగా జట్టులో కొనసాగాలో వద్దో వారిద్దరికీ క్లారిటీ వస్తుంది. ఇప్పటికే గిల్, జైస్వాల్, తిలక్ లాంటి యంగ్ ప్లేయర్లు చాలా మంది సత్తా చాటుతున్నారు. కాబట్టి రోహిత్, కోహ్లీ రాణించాల్సిందే’ అని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.
News October 14, 2025
వెంకటేశ్ మూవీ హిందీ రీమేక్‌లో అక్షయ్

వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతోంది. అయితే ఈ మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అందులో తాను హీరోగా నటిస్తున్నట్లు అక్షయ్ కుమార్ వెల్లడించారు. ఈ చిత్రానికి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తుండగా.. హీందీలోనూ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.