News February 1, 2025
Income Tax: ఎవరికి ఎంత డబ్బు ఆదా అవుతుందంటే..
కొత్త పన్ను విధానంలో ప్రస్తుత శ్లాబుల ప్రకారం ₹8L ఆదాయముంటే ₹30K, ₹9Lకు ₹40K, ₹10Lకు ₹50K, ₹11Lకు ₹65K, ₹12Lకు ₹80K పన్ను కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు SD, రిబేటుతో కలిపి ₹12.75L వరకు పన్ను లేదు కాబట్టి ఆ మేరకు లబ్ధి కలిగినట్టే. గతంతో పోలిస్తే ఇక నుంచి ₹16Lకు ₹50K, ₹20Lకు ₹90K, ₹24Lకు ₹1.10L, ₹50Lకు ₹1.10L మేర ట్యాక్స్ బెనిఫిట్ కల్పించారు. అంటే వీరికి సగటున ఏటా 30% డబ్బు ఆదా అవుతున్నట్టే.
Similar News
News February 1, 2025
కేంద్ర బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?
AP: కేంద్ర బడ్జెట్‌ను CM చంద్రబాబు స్వాగతించారు. వార్షికాదాయం రూ.12లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం గొప్ప పరిణామం అని చెప్పారు. PM మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. పేదలు, మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి 6 కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందన్నారు. ఈ సందర్భంగా కేంద్రం, ఆర్థిక మంత్రి నిర్మలకు CM అభినందనలు చెప్పారు.
News February 1, 2025
కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు ఇలా..
ఏపీకి స్పెషల్ ప్యాకేజీ కింద 2024 DEC 24 వరకు రూ.3,685.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే బడ్జెట్లో పలు కేటాయింపులు చేసింది.
* పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936cr
* ప్రాజెక్ట్ నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటు రూ.12,157cr
* విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295cr
* విశాఖ పోర్టుకు రూ.730cr
* ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి: రూ.162cr
* జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు: రూ.186cr
News February 1, 2025
భారీ ఎన్కౌంటర్.. 8 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరగ్గా 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది.