News February 1, 2025
Income Tax: 33% కాదు.. ₹15Lపై 6, ₹25Lపై 13శాతమే పన్ను

మోదీ సర్కారు వేతన జీవులకు భారీ ఊరటే కల్పించింది. Income Tax భారాన్ని అనూహ్యంగా తగ్గించేసింది. ఇకపై ₹13Lకు చెల్లించేది ₹75వేలే. ₹14Lకు ₹90వేలు, ₹15Lకు ₹1.05L, ₹16Lకు ₹1.20L మాత్రమే. అంటే ఎఫెక్టివ్లీ వార్షిక వేతనంలో 6 శాతమే పన్ను కడుతున్నట్టు లెక్క. ₹20Lపై ₹2L (10%), ₹25Lపై ₹3.3L (13.2%) పన్నే కట్టాలి. అంతేగానీ సోషల్ మీడియాలో మొత్తుకున్నట్టు 33% చెల్లించరు. శ్లాబులను పట్టుకొని తికమకపడొద్దు.
Similar News
News December 6, 2025
మూడో విడతలో 27,277 నామినేషన్లు

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతలో 4,158 సర్పంచ్ స్థానాలకు 27,277 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. 36,442 వార్డు స్థానాలకు 89,603 మంది నామినేషన్లు వేశారని పేర్కొన్నారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 1,192 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. ఉపసంహరణకు గడువు ఈ నెల 9 వరకు ఉంది. మూడో విడత ఎన్నికలు 17న జరగనున్నాయి.
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.


