News March 17, 2024
ట్రాన్స్కో ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు

TG: ట్రాన్స్కో ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతూ సంస్థ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. మరో రెండేళ్లపాటు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Similar News
News October 24, 2025
మళ్లీ అదే సిడ్నీ.. కోహ్లీ రేపు ఏం చేస్తారో?

రేపు ఆస్ట్రేలియాతో 3వ వన్డే జరిగే సిడ్నీ వేదిక విరాట్ కోహ్లీ అభిమానులను కలవరపెడుతోంది. 10 నెలల క్రితం ఆయన ఇదే స్టేడియంలో చివరి టెస్ట్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందా అనేదే ఫ్యాన్స్ ఆందోళన. తొలి 2 మ్యాచుల్లో డకౌట్, 2వ వన్డేలో అభిమానులకు కోహ్లీ <<18081069>>అభివాదం<<>> చేయడం మరింత కలవరపెడుతున్నాయి. దీంతో రేపు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మీరేమంటారు?
News October 24, 2025
సూపర్ ఫిట్గా శర్వానంద్

టాలీవుడ్ హీరో శర్వానంద్ కొత్త లుక్లో అదరగొడుతున్నారు. సన్నగా మారిపోయి, సడన్గా చూస్తే గుర్తుపట్టలేనంతగా ట్రాన్స్ఫామ్ అయ్యారు. శర్వానంద్ ప్రస్తుతం ‘బైకర్’ అనే స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ మూవీలో నటిస్తుండగా, సినిమాలో పాత్ర కోసం సిక్స్ ప్యాక్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కాస్త బొద్దుగా ఉన్న ఆయన సూపర్ ఫిట్గా మారిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. శర్వానంద్ కొత్త లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
News October 24, 2025
సమస్యలను దూరం చేసే వాస్తు దిక్కును ఎలా ఎంచుకోవాలి?

ఇల్లు కట్టుకునేటప్పుడు/కొనేటప్పుడు ఆ ఇంటి దిక్కు మనకు మంచి చేస్తుందా లేదా అని చూసుకోవడం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. జన్మరాశి ఆధారంగా మన ఇంటికి ఏ దిక్కు అనుకూలమో ముందే తెలుసుకోవచ్చని సూచించారు. ‘జన్మ రాశి, నక్షత్రం తెలియకపోయినా, పేరు బలాన్ని ఉపయోగించి ఏ దిక్కు శుభప్రదమో తెలుసుకోవచ్చు. వాస్తు విషయంలో దిక్కుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి’ అని అన్నారు. <<-se>>#Vasthu<<>>


