News March 25, 2025
ఏటీఎం ఛార్జీల పెరుగుదల.. ఎప్పటినుంచంటే..

ఈ ఏడాది మే 1 నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు పెరగనుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో ప్రాంతాల్లో 5సార్లు, నాన్ మెట్రో ప్రాంతాల్లో 3సార్లు ప్రతి నెలా ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. మే 1 నుంచి ఆ పరిధి దాటితే డబ్బు విత్‌డ్రాకు ఇప్పుడున్న రూ.17 నుంచి రూ.19కి, బాలెన్స్ చెకింగ్‌కు ఇప్పుడున్న రూ.6 నుంచి రూ.7కి ఛార్జీలు పెరగనున్నాయి.
Similar News
News March 28, 2025
ఏపీలో బర్డ్‌ఫ్లూతో 6 లక్షల కోళ్లు మృతి: అంతర్జాతీయ సంస్థ

APలోని 8 ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ విజృంభించినట్లు పారిస్‌కు చెందిన వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ వెల్లడించింది. కోళ్ల ఫామ్స్‌తో పాటు ఇంట్లో పెంచుకునే కోళ్లకూ ఇది సోకిందని తెలిపింది. రాష్ట్ర తూర్పు ప్రాంతాల్లో H5N1 ఎక్కువగా విస్తరించినట్లు పేర్కొంది. దీనివల్ల 6,02,000 కోళ్లు చనిపోయినట్లు వివరించింది. కాగా ఇటీవల ఉ.గోదావరి, కృష్ణా, NTR జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
News March 28, 2025
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేత

AP: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి చుక్కెదురైంది. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ అట్రాసిటీ కేసుల కోర్టు కొట్టివేసింది. ఐవో, ప్రాసిక్యూషన్ జేడీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
News March 28, 2025
Stock Markets: ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్ మినహా…

స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యాయి. నిఫ్టీ 23,519 (-72), సెన్సెక్స్ 77,414 (-191) వద్ద ముగిశాయి. FMCG, ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. మీడియా, ఐటీ, రియాల్టి, ఆటో, మెటల్, ఫార్మా, కమోడిటీస్, పీఎస్‌యూ బ్యాంకు, హెల్త్‌కేర్, ఎనర్జీ షేర్లు ఎరుపెక్కాయి. టాటా కన్జూమర్, కొటక్ బ్యాంకు, అపోలో హాస్పిటల్స్, ONGC, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్. విప్రో, ఇండస్‌ఇండ్, శ్రీరామ్ ఫైనాన్స్, సిప్లా టాప్ లూజర్స్.