News September 2, 2024
మృతుల కుటుంబాలకు పరిహారం పెంపు

TG: వరద మృతుల కుటుంబాలకు పరిహారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద వల్ల మృతి చెందిన కుటుంబాలకు ఇప్పటివరకు రూ.4 లక్షల పరిహారం ఇస్తుండగా దాన్ని రూ.5 లక్షలకు పెంచారు. మరోవైపు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల వరద పరిస్థితిని సీఎం సమీక్షిస్తున్నారు.
Similar News
News November 20, 2025
HYD: సౌదీలో మృతదేహాలకు రేపు అంత్యక్రియలు: అజహరుద్దీన్

సౌదీలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారికి రేపు అంత్యక్రియలు చేయనున్నట్లు మైనారిటీ శాఖ మంత్రి అజహరుద్దీన్ తెలిపారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ మంత్రి అజహరుద్దీన్, ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ సౌదీ అధికారులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా మృతుల కుటుంబసభ్యులు సైతం సౌదీకి చేరుకున్నారు.
News November 20, 2025
₹600Crతో TG పోలీసు AMBIS అప్గ్రేడ్

TG పోలీస్ శాఖ నేర పరిశోధన వేగాన్ని పెంచేందుకు ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(AMBIS)ను అప్గ్రేడ్ చేస్తోంది. పాతబడిన సర్వర్లు, స్టోరేజ్ స్థానంలో లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ₹600Cr మంజూరు చేసింది. ఈ వ్యవస్థ అన్ని PSలలోని పరికరాలను లింక్ చేస్తుంది. AI సాయంతో సెకన్లలోనే బయోమెట్రిక్ మ్యాచింగ్ పూర్తవుతుంది.
News November 20, 2025
మొక్కజొన్నలో పాము పొడ తెగులును ఎలా గుర్తించాలి?

పాము పొడ తెగులు ముందుగా నేలకు దగ్గరగా ఉండే మొక్కజొన్న మొక్కల కింది ఆకులపై సోకుతుంది. తర్వాత పై ఆకులకు, కాండానికి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన మొక్కల ఆకులు, కాండంపై బూడిద, గోధుమ వర్ణపు మచ్చలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి.. చూడటానికి పాముపొడ వలే కనిపిస్తాయి. కాండంపై ఏర్పడిన తెగులు లక్షణాల వల్ల కణుపుల వద్ద మొక్కలు విరిగి నేలపై పడిపోతాయి. దీని వల్ల మొక్కల సంఖ్య తగ్గి పంట దిగుబడి పడిపోతుంది.


