News December 1, 2024

కేజీబీవీల్లో డైట్ ఛార్జీల పెంపు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో డైట్ ఛార్జీలను పెంచుతూ సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి రూ.1400 ఇస్తుండగా, రూ.1600కు పెంచినట్లు తెలిపారు. ఈ ఛార్జీలతో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నారు. తాజా నిర్ణయంతో 1.1లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

Similar News

News December 1, 2024

బాబు ష్యూరిటీ-బాదుడు గ్యారంటీ: అంబటి

image

AP: విద్యుత్ ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారంటీ.. ఎన్నికల తర్వాత బాబు ష్యూరిటీ-బాదుడు గ్యారంటీ’ అని రాసుకొచ్చారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపైనా ఆయన సెటైర్లు వేశారు. ‘ప్రతి వైన్ షాపునకూ బెల్ట్ ఉంది.. బాబుకే బెల్ట్ లేదు తీయడానికి!’ అని రాసుకొచ్చారు.

News December 1, 2024

టీచర్ల బదిలీల రోడ్ మ్యాప్ ఇదే

image

AP: ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 25, జనవరి 25, ఫిబ్రవరి 10 తేదీల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేషన్ చేస్తారు. ఫిబ్రవరి 15, మార్చి 1, 15 తేదీల్లో సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారు. ఏప్రిల్ 10-15 వరకు HMలు, 21-25 వరకు SA, మే 1-10 వరకు SGTల బదిలీలు పూర్తిచేస్తారు. అలాగే ఏప్రిల్ 16-20 వరకు HMలు, మే 26-30 వరకు SAల ప్రమోషన్లు చేపడతారు.

News December 1, 2024

ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం

image

TG: ములుగు జిల్లా ఏటూరునాగారంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేత బద్రు సహా ఇతరులు ఉన్నట్లు సమాచారం.