News October 21, 2024
నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీల పెంపు?

TG: విద్యుత్ ఛార్జీలు పెంచేలా ఆ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై నేటి నుంచి 5 రోజుల పాటు విద్యుత్ నియంత్రణ మండలి విచారణ చేపట్టనుంది. 2024-25లో రూ.1200 కోట్ల మేర ఛార్జీలు పెంచేందుకు అనుమతివ్వాలని TGSPDCL/TGNPDCL కోరుతున్నాయి. HT కేటగిరీ విద్యుత్ ఛార్జీల పెంపు, LT కేటగిరీలో నెలకు 300 యూనిట్లకు పైగా వాడే వారికి ఫిక్స్డ్ ఛార్జీల పెంపునకు డిస్కంలు ప్రతిపాదించాయి. NOV 1 నుంచి ఛార్జీలు పెరిగే అవకాశముంది.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్‌గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


