News November 12, 2024
EPF, EPS కాంట్రిబ్యూషన్ లిమిట్ పెంచితే ఉద్యోగికి నష్టమా?

EPF బేసిక్ పే లిమిట్ రూ.15K నుంచి రూ.21Kకు పెంచే యోచనలో కేంద్రం ఉంది. ప్రస్తుతం ఈ లిమిట్ దాటినవాళ్ల ఎంప్లాయీ (12%), ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ (12%) EPFలోనే జమ అవుతున్నాయి. లిమిట్ లోపు ఉన్నవాళ్ల ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్లో 8.33% అంటే గరిష్ఠంగా రూ.1250 EPSకు వెళ్తుంది. లిమిట్ పెంచితే ఇది రూ.1749 వరకు పెరుగుతుంది. దీంతో EPF తగ్గి EPS కార్పస్ పెరుగుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ పింఛన్ లభిస్తుంది.
Similar News
News December 7, 2025
రూ.24 రీఫండ్ కోసం రూ.87,000 పోగొట్టుకుంది

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళ సైబర్ మోసానికి గురైంది. జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసిన ఆమె రీఫండ్ కోసం పొరపాటున ఆన్లైన్లో రాంగ్ కస్టమర్ నంబర్‌కు కాల్ చేసింది. ఇదే అదనుగా కేటుగాళ్లు ఆమెకు వాట్సాప్‌లో APK ఫైల్ పంపించి బ్యాంక్ వివరాలతో మూడు అకౌంట్ల నుంచి రూ.87వేలు కొట్టేశారు. మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News December 7, 2025
కర్ణాటక కాంగ్రెస్‌లో ముగియని ‘కుర్చీ’ వివాదం

కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య CM పీఠంపై ఏర్పడిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. గత వారం ఈ ఇద్దరితో అధిష్ఠానం చర్చించగా వివాదం సమసినట్లు కనిపించింది. కానీ తాజాగా ‘మార్పు’కు సిద్ధం కావాలని DK ఓ సమావేశంలో సహచరులకు సూచించడంతో అదింకా ముగియలేదని స్పష్టమవుతోంది. ‘దేవుడు అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటితో మనం ఏం చేస్తామో అదే ముఖ్యం. ‘మార్పు’కు సిద్ధంగా ఉండండి’ అని వివరించారు.
News December 7, 2025
ఇతిహాసాలు క్విజ్ – 89 సమాధానం

ఈరోజు ప్రశ్న: కురుక్షేత్రంలో పాల్గొన్న వృద్ధరాజు. భీష్ముడికి తండ్రి వరుస అవుతాడు. ధర్మం వైపు మొగ్గు ఉన్నా, రాజధర్మం కారణంగా కౌరవులకు మద్దతు ఇచ్చాడు. చివరికి భీముడి చేత మరణం పొందాడు. ఎవరతను?
సమాధానం: బాహ్లికుడు. ఈయన శంతనుడి సోదరుడు.
<<-se>>#Ithihasaluquiz<<>>


