News November 8, 2024
హెచ్డీఎఫ్సీ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు

రుణగ్రహీతలకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు షాక్ ఇచ్చింది. రెండు షార్ట్ టర్మ్ టెన్యూర్లపై, ఒక లాంగ్ టర్మ్ లోన్లపై వడ్డీ రేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటుని 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ఏడాది కాలపరిమితితో తీసుకునే వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు 9.45శాతానికి చేరుకుంది. అలాగే ఒక్క రోజు రుణాలపై వడ్డీ రేటు 9.15 శాతానికి చేరుకోగా, నెల రుణాలపై వడ్డీ 9.20 శాతానికి చేరుకుంది.
Similar News
News November 24, 2025
నల్గొండ జిల్లాలో బీసీలకు తగ్గిన స్థానాలు

నల్గొండ జిల్లాలో రిజర్వేషన్ల కేటాయింపులో రొటేషన్ విధానం బీసీలను దెబ్బతీసింది. 2019 ఎన్నికలతో పోలిస్తే భారీ ఎత్తున బీసీ రిజర్వేషన్లు తగ్గిపోవడంపై బీసీల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆదివారం ఆర్డీఓల ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా సర్పంచ్ రిజర్వేషన్లు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 869 జీపీలు ఉండగా.. ఇందులో బీసీలకు 140 (2019లో 164) స్థానాలు రిజర్వ్ అయ్యాయి.
News November 24, 2025
భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.
News November 24, 2025
118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

<


