News November 28, 2024
మధ్యాహ్నం భోజనం ధరల పెంపు
మధ్యాహ్న భోజన పథకం ధరలను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థికి రూ.5.45 చొప్పున ఇస్తుండగా దానిని రూ.6.19కి పెంచింది. హైస్కూళ్లలో చదివే వారికి 8.17 చొప్పున చెల్లిస్తుండగా రూ.9.29కి పెంచింది. పెంచిన ధరలను డిసెంబర్ 1 నుంచి అమలు చేయనున్నారు. ఈ ఖర్చులో కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు భరించనున్నాయి.
Similar News
News November 28, 2024
HYDలో తగ్గిన యాపిల్ ధరలు
గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్‌లో యాపిల్ ధరలు తగ్గాయి. 2023 డిసెంబర్లో మంచి నాణ్యత గల యాపిల్స్ ఒక్కోటి ₹35-₹40, సాధారణ రకం పండ్లు ఒక్కోటి ₹25కు లభించాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి హై క్వాలిటీ యాపిల్స్ ఒక్కోటి ₹18, రెగ్యులర్ క్వాలిటీ పండ్లు ఒక్కోటి ₹10కే దొరుకుతున్నాయి. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లో పంటలు బాగా పెరగడం, HYD పండ్ల మార్కెట్లకు సరఫరా పెరగడంతో ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
News November 28, 2024
వీలైనంత త్వరగా పింఛన్ల పెంపు: మంత్రి
TG: దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు వీలైనంత త్వరగా పెంచుతామని మంత్రి సీతక్క అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడలను మంత్రి ప్రారంభించారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
News November 28, 2024
ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్!
యూజర్ల సౌలభ్యం కోసం ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ తరహాలో IGలోనూ లొకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం యూజర్లు చాట్‌లోకి వెళ్లిన తర్వాత మెనూబార్‌లో లొకేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కరెంట్ లొకేషన్‌తో పాటు గంటపాటు లైవ్ లొకేషన్‌నూ షేర్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ ప్రస్తుతం కొన్ని దేశాలకే పరిమితం చేసినట్లు మెటా సంస్థ పేర్కొంది. త్వరలో మిగిలిన దేశాలకూ విస్తరించనుంది.