News May 14, 2024
ఎన్నికలు పూర్తికాగానే నెట్‌వర్క్ ఛార్జీల పెంపు?
టెలికాం సంస్థలు ఎన్నికల తర్వాత బిల్లులను పెంచాలని ప్లాన్ చేస్తున్నట్లు యాక్సిస్ క్యాపిటల్ వెల్లడించింది. 25% వరకు ఛార్జీలు పెంచి, యూజర్ల నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవాలని సంస్థలు భావిస్తున్నట్లు తెలిపింది. దీంతో టెలికాం ఆపరేటర్లకు ARPUలో 16% వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. అయితే యూజర్లపై పెద్దగా భారం పడకపోవచ్చని యాక్సిస్ క్యాపిటల్ అంచనా వేసింది.
Similar News
News January 12, 2025
ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మద్దేడు పీఎస్ పరిధిలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు లభించాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 12, 2025
బాధితులకు టీటీడీ చెక్కుల పంపిణీ
AP: తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీటీడీ నష్టపరిహారం అందజేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 4 కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసింది. లావణ్య, రజనీ, శాంతి కుటుంబసభ్యులకు రూ.25 లక్షలు అందించింది. అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం కల్పించనుంది. మృతుల పిల్లలకు ఉచిత విద్య అందించనుంది.
News January 12, 2025
లాస్ ఏంజెలిస్ కార్చిచ్చులో బాలీవుడ్ నటి
లాస్ ఏంజెలిస్‌లో ఏర్పడిన కార్చిచ్చులో బాలీవుడ్ స్టార్ నటి ప్రీతి జింటా చిక్కుకున్నారు. అక్కడి పరిస్థితులను వివరిస్తూ ఆమె ట్వీట్ చేశారు. ‘చుట్టూ జరుగుతోన్న విధ్వంసం చూసి భయాందోళనకు గురయ్యాం. చిన్న పిల్లలు, వృద్ధులతో చాలా మంది పొరుగువారు ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. ఇవన్నీ చూసి నేను హృదయవిదారకంగా ఉన్నా. మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు దేవుడికి & అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు.