News November 22, 2024
డిసెంబర్ నుంచి పెన్షన్ల పెంపు?

TG: వచ్చే నెల 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి కానుంది. ఆలోగా ఆసరా పెన్షన్ల పెంపు, రైతు భరోసా పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం ఆసరా పింఛన్లకు ₹2,016, దివ్యాంగ పింఛన్లకు ₹3,016 ఇవ్వగా, తాము ఆసరా పింఛను ₹4,000, దివ్యాంగ పింఛన్ ₹6,000 చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రైతు భరోసా కింద ఏటా ఎకరాకు ₹15,000 అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 29, 2026
నోటీసులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరు: KTR

TG: KCRకు <<18992001>>నోటీసులు<<>> ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం అని కేటీఆర్ అన్నారు. ‘తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నోటీసులు ఇచ్చింది. నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరు’ అని ట్వీట్ చేశారు.
News January 29, 2026
AI షాక్: 2008 కంటే ఘోరమైన సంక్షోభం రాబోతుందా?

భవిష్యత్తులో కృత్రిమ మేధ (AI) వల్ల 2008 నాటి ఆర్థిక మాంద్యం కంటే దారుణమైన పరిస్థితులు రావొచ్చని 2025-26 ఆర్థిక సర్వే హెచ్చరించింది. దీనికి అవకాశం తక్కువే ఉన్నా.. జరిగితే మాత్రం ప్రభావం తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. ‘భారత్‌లోని IT రంగం, వైట్ కాలర్ ఉద్యోగాలకు AI పెద్ద ముప్పుగా మారనుంది. ఇప్పటికే IT రంగంలో వృద్ధి ఉన్నా దానికి తగ్గట్టుగా కొత్త ఉద్యోగాలు రావడం లేదు’ అని సర్వే పేర్కొంది.
News January 29, 2026
HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

HLL లైఫ్‌కేర్ లిమిటెడ్ 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల వారు ఫిబ్రవరి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA(ఫైనాన్స్, ఆపరేషన్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్), బీఫార్మసీ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిప్యూటీ మేనేజర్‌కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. అసిస్టెంట్ మేనేజర్‌కు 37ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.lifecarehll.com


