News October 30, 2024
ఐపీఎల్లో ప్లేయర్ కనీస ధర పెంపు?

ఐపీఎల్ వేలంలో ప్లేయర్ కనీస ధర ఇప్పటి వరకు రూ.20 లక్షలుగా ఉన్న సంగతి తెలిసిందే. అది ఇకపై రూ.30 లక్షలు కావొచ్చని తెలుస్తోంది. అన్క్యాప్డ్ ప్లేయర్లకు లభించే రూ.20 లక్షలు చాలా తక్కువ అని నిర్వాహకులు భావిస్తున్నారని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో వారికి మరో రూ. 10 లక్షలు పెంచినట్లు వివరించాయి. వేలానికి సంబంధించి.. ఆటగాళ్ల రిటెన్షన్ గడువు రేపటితో ముగియనుంది.
Similar News
News November 24, 2025
కాలిన వత్తితో ఇలా చేస్తే.. ఇంటికి ఎంతో మంచిది

దీపారాధనలో కాలిపోయిన వత్తిని చాలామంది పడేస్తుంటారు. కానీ, దానిలో ఎంతో సానుకూల శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ‘కాలిన 10 వత్తులలో కర్పూరం వెలిగించి, అందులో 4 లవంగాలు వేసి దూపంలా తయారుచేసుకోవాలి. ఆ పొగను ఇల్లు అంతటా వ్యాపించేలా చేస్తే.. ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ బయటకి వెళ్లిపోతాయి. ఆ బూడిదను దిష్టి తీయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది’ అని అంటున్నారు.
News November 24, 2025
ఆశ్లేష కురిస్తే ఆరోగ్యం

ఆశ్లేష నక్షత్రం సాధారణంగా జూలై చివరిలో లేదా ఆగస్టు మొదటి వారంలో వస్తుంది. ఆ సమయంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే, పంట పొలాలకు నీరు అందుతుంది, భూమి సారవంతమవుతుంది అలాగే ఆ సంవత్సరంలో మంచి దిగుబడి వస్తుందని రైతుల నమ్మకం. దీని వల్ల ప్రజలందరికీ ఆహార భద్రత ఏర్పడి, సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉంటారని ఈ సామెత సూచిస్తుంది.
News November 24, 2025
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మితే క్రిమినల్ కేసులు

TG: ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మితే లబ్ధిదారులపై POT యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హౌసింగ్ కార్పొరేషన్ MD పీవీ గౌతమ్ తెలిపారు. అలాంటి ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఇళ్లు అద్దెకు ఇచ్చినా రద్దు చేస్తామని పేర్కొన్నారు. GHMCలో ఇప్పటికే సర్వే చేశామని, త్వరలో జిల్లాల్లోనూ సర్వే చేస్తామన్నారు. కొల్లూరు, రాంపల్లిలో ₹20L-50Lకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.


