News October 2, 2024
మెడికల్ పీజీలో సర్వీస్ కోటా పెంపు

AP: మెడికల్ పీజీ కోర్సుల్లో ఇన్ సర్వీస్ కోటా రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 15% నుంచి 20శాతానికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో 15శాతానికే పరిమితం చేయడంతో PHC వైద్యులు ఆందోళనకు దిగారు. వారితో చర్చల అనంతరం ప్రభుత్వం ఇన్సర్వీస్ రిజర్వేషన్ను క్లినికల్ విభాగంలో 20శాతానికి పెంచగా, నాన్-క్లినికల్ సీట్లలో రిజర్వేషన్ మాత్రం 30శాతానికి పరిమితం చేశారు. ఈ ఏడాది నుంచే ఇది అమల్లోకి రానుంది.
Similar News
News November 24, 2025
KMR: బరిలో పోటీ చేసేదెవరో తేలిపోయింది!

కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలోని 532 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ స్థానాలకు, 4656 వార్డు స్థానాలకు రిజర్వేషన్లను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశారు. కోర్టు ఆదేశాల మేరకు, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఈ స్థానాలను ఖరారు చేయడం జరిగింది. దీనితో ఎవరు ఎక్కడ పోటీ చేయాలో స్పష్టత వచ్చింది.
News November 24, 2025
ముగిసిన G20 సమ్మిట్.. చర్చించిన అంశాలివే..

సౌతాఫ్రికాలో జరిగిన G20 సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. 20దేశాలకు చెందిన దేశాధినేతలు ఇందులో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా దేశాల మధ్య యుద్ధ వాతావరణాలను తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులు, మైనింగ్, టెక్నాలజీ, AI సాంకేతికతలో పరస్పరం సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చారు. రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపైనా చర్చించారు.
News November 24, 2025
గొప్ప జీవితం అంటే ఏంటి?

‘గొప్ప జీవితం’ అంటే డబ్బు సంపాదించడమో, భోగాలు అనుభవించడమో, ధనవంతులుగా కీర్తి సంపాదించడమో కాదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ధర్మబద్ధంగా జీవించడమే దేవుడిచ్చిన జన్మకు సార్థకమంటున్నాయి. ఈ సత్యాన్నే మన రామాయణ మహాభారత గాథలు లోకానికి చాటిచెప్పాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు కేవలం గొప్పవారు కావాలని చెబుతుంటారు. అందుకు బదులుగా ధర్మ బుద్ధి కలిగి ఉండాలని కోరుకోవాలి. అవే శాశ్వతమైన ఆనందాన్ని, విలువను ఇస్తాయి.


