News May 4, 2024

జొన్నల కొనుగోళ్ల పరిమితి 12 క్వింటాళ్లకు పెంపు

image

TG: ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో జొన్న కొనుగోళ్ల పరిమితిని ఎకరాకు 12 క్వింటాళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా దిగుబడుల ఆధారంగా ఎకరానికి 8.85 క్వింటాళ్ల పరిమితితో ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేస్తోంది. మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాలుకు ₹3180 మద్దతు ధరగా చెల్లిస్తోంది. రైతులెవరూ పంటను తక్కువ ధరకు అమ్మవద్దని, మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు.

Similar News

News November 16, 2025

WOW.. చీమ కాలుపైనున్న వెంట్రుకలను కూడా గుర్తించే లెన్స్!

image

జార్జియా టెక్ శాస్త్రవేత్తలు విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే PHySL అనే విప్లవాత్మక సాఫ్ట్ రోబోటిక్ లెన్స్‌ను సృష్టించారు. చీమ కాలుపై వెంట్రుకలను కూడా గుర్తించగలిగే సామర్థ్యం దీనికుందని చెబుతున్నారు. 4 మైక్రోమీటర్ల వెడల్పున్న అతి చిన్న వస్తువులను సైతం దీంతో స్పష్టంగా చూడొచ్చంటున్నారు. సర్జికల్ రోబోట్‌లు, వైద్యం, వ్యవసాయంతో సహా అనేక రంగాలలో ఈ సాంకేతికత అద్భుతమైన మార్పులు తీసుకొస్తుందని తెలిపారు.

News November 16, 2025

పొద్దుతిరుగుడు విత్తనాలను ఇలా నాటితే మేలు

image

పొద్దుతిరుగుడు సాగు చేసే రైతులు బోదెలు చేసి విత్తనం నాటినట్లైతే నీటితడులు ఇవ్వడానికి, ఎరువులను వేయుటకు అనుకూలంగా ఉండటమే కాకుండా మొక్కకు పటుత్వం కూడా లభిస్తుంది. నేల స్వభావాన్ని బట్టి విత్తే దూరం నిర్ణయించాలి. తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెం.మీ. మరియు మొక్కల మధ్య 20-25 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. బరువైన నేలల్లో వరుసల మధ్య 60 సెం.మీ. మరియు మొక్కల మధ్య 30 సెం.మీ. దూరంలో విత్తాలి.

News November 16, 2025

బీజేపీకి ఓటు వేస్తేనే హిందువులా?.. MLAపై నెటిజన్ల ఫైర్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి తర్వాత ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఓడిపోయాం అంతే చచ్చిపోలేదు. బీజేపీకి ఓటు వేసిన 17,056 మంది కట్టర్ హిందూ బంధువులకు ధన్యవాదాలు. కనీసం మీరైనా హిందువులుగా బతికి ఉన్నందుకు గర్వపడుతున్నా. జై హిందుత్వ’ అని పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేస్తేనే హిందువులా.. ఓటు వేయకుంటే హిందువులు కాదా? అని నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు.