News July 4, 2024
స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ₹లక్షకు పెంపు?

త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో వేతనజీవులకు ఊరట లభించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ప్రస్తుతం సంవత్సరానికి ₹50వేలు ఉండగా ఆ మొత్తాన్ని ₹లక్షకు పెంచనున్నట్లు తెలుస్తోంది. దీనిని క్లెయిమ్ చేసుకునేందుకు ఉద్యోగులు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. పెన్షన్ అందుకునే మాజీ ఉద్యోగులకు కూడా ఈ స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది.
Similar News
News November 14, 2025
సుపరిపాలన, అభివృద్ధి విజయమిది: మోదీ

బిహార్ ఎన్నికల్లో విజయంపై PM మోదీ స్పందించారు. ‘సుపరిపాలన, అభివృద్ధి, ప్రజానుకూల స్ఫూర్తి, సామాజిక న్యాయం గెలిచింది. చరిత్రాత్మక, అసమాన గెలుపుతో NDAను ఆశీర్వదించిన బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజలకు సేవ చేసేందుకు, బిహార్ కోసం పని చేసేందుకు ఈ తీర్పు మాకు మరింత బలాన్నిచ్చింది’ అని ట్వీట్ చేశారు. తమ ట్రాక్ రికార్డు, రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే తమ విజన్ ఆధారంగా ప్రజలు ఓటేశారని తెలిపారు.
News November 14, 2025
ఇతిహాసాలు క్విజ్ – 66 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: విదురుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించకుండా ‘మంత్రి’ పాత్రకే ఎందుకు పరిమితమయ్యారు?
జవాబు: ధృతరాష్ట్రుడు, పాండురాజు.. ఈ ఇద్దరూ అంబిక, అంబాలిక గర్భాన జన్మించారు. కానీ, విదురుడు దాసి గర్భాన జన్మించడం వలన, ఆనాటి రాజ్యాంగ నియమం ప్రకారం సింహాసనాన్ని అధిష్ఠించే అర్హతను కోల్పోయి, మంత్రి పాత్రకే పరిమితం అయ్యారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 14, 2025
వైభవ్ ఊచకోత.. 32 బంతుల్లో సెంచరీ

మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో పసికూన UAE-Aని భారత్-A బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోస్తున్నారు. దోహాలో జరుగుతున్న టీ20లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ కొట్టారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న వైభవ్ ఏకంగా 9 సిక్సర్లు, 10 ఫోర్లు బాదారు. దీంతో ఇండియా-A 10 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 149 రన్స్ చేసింది.


