News October 21, 2024
బీఎస్సీ(ఆనర్స్) సీట్ల సంఖ్య పెంపు

TG: జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ బీఎస్సీ(ఆనర్స్) సీట్లను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరంలో అదనంగా 200 సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ అవసరాలు, విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రత్యేక కోటాలో ఉన్న ఈ కోర్సు ఫీజును రూ.10లక్షల నుంచి రూ.5లక్షలకు తగ్గించింది.
Similar News
News November 24, 2025
హైకమాండ్ కోరుకుంటే సీఎంగా కొనసాగుతా: సిద్దరామయ్య

కాంగ్రెస్ హైకమాండ్ కోరుకుంటే తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. మార్పులు ఏవైనా కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని చెప్పారు. వారు ఏం చెప్పినా తాను, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంగీకరించాల్సిందేనని తెలిపారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు 4-5 నెలల కిందటే హైకమాండ్ ఒప్పుకుందని, అయితే 2.5 ఏళ్ల టర్మ్ పూర్తయ్యేదాకా ఆగాలని చెప్పిందని పేర్కొన్నారు.
News November 24, 2025
భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది: ప్రధాని మోదీ

ధర్మేంద్ర మరణంతో భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నటనతో అనేక పాత్రలకు ఆయన ప్రాణం పోశారని కొనియాడారు. ధర్మేంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ట్వీట్ చేశారు. ధర్మేంద్ర మృతికి బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, తదితరులు సంతాపం తెలిపారు.
News November 24, 2025
BREAKING: భారత్ ఆలౌట్

సౌతాఫ్రికాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత్ 201 పరుగులకు ఆలౌటైంది. 122కే 7 వికెట్లు కోల్పోయిన దశలో సుందర్, కుల్దీప్ 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జైస్వాల్ 58, రాహుల్ 22, సాయి 15, పంత్ 7, జడేజా 6, నితీశ్ రెడ్డి 10, సుందర్ 48, కుల్దీప్ 19, బుమ్రా 5 రన్స్ చేశారు. IND 288 పరుగులు వెనుకబడింది. ఫాలో ఆన్ ఆడాల్సి ఉన్నా RSA బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. జాన్సెన్ 6 వికెట్లతో సత్తా చాటారు.


