News July 1, 2024
వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితులు పెంపు

రాష్ట్రాలు, UTలకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్(WMA) పరిమితులను RBI పెంచింది. గతంలో వాటి లిమిట్ ₹47,010 కోట్లు ఉండగా, ఇవాళ్టి నుంచి ఆ మొత్తాన్ని ₹60,118 కోట్లకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఏపీ ప్రభుత్వ పరిమితి ₹2,252 కోట్ల నుంచి ₹2,921 కోట్లకు పెరిగింది. అత్యవసర ఖర్చులకు నిధుల లభ్యత లేనప్పుడు తాత్కాలిక రుణ సౌకర్యం కల్పించడాన్ని WMA అంటారు. 3 నెలలలోపు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
Similar News
News December 3, 2025
వాస్తు శాస్త్రం అంటే ఏమిటి?

మనిషి మనుగడ, రక్షణకు దోహదపడుతున్న నివాసాలు, నిర్మాణాల గురించి వివరించేదే వాస్తుశాస్త్రం అని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. వాస్తు అంటే వాస్తవం అని, వస్తువు అమరిక వినియోగంతో ప్రయోజనం కలిగించేదే వాస్తు శాస్త్రమని అంటున్నారు. ‘పకృతిలో జరిగే మార్పులు, సమయం, అవగాహన, అనుభవాల వ్యత్యాసాల వల్ల వాస్తు ఫలితాలలో మార్పులు సంభవించవచ్చు. వీటికి ఎవరూ అతీతులు కారు’ అని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 3, 2025
GHMCలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం

TG: గ్రేటర్ హైదరాబాద్లో 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల విలీనం పూర్తయింది. ఇది నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ORR వరకు, దానికి అవతలి వైపు ఆనుకొని ఉన్న ప్రాంతాలను GHMCలో విలీనం చేయాలని ఇటీవల ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయించింది. దీనికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఈ విలీనం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది.
News December 3, 2025
మార్క్రమ్ సెంచరీ.. ఔట్ చేసిన హర్షిత్

భారత్ నిర్దేశించిన 359 పరుగుల భారీ లక్ష్యం వైపు సాగుతున్న సౌతాఫ్రికాను హర్షిత్ రాణా దెబ్బ కొట్టారు. తొలి వన్డే ఆదిలోనే వికెట్లు తీసిన అతడు తాజాగా సెంచరీతో చెలరేగిన మార్క్రమ్ను వెనక్కి పంపారు. 110 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడిని పెవిలియన్ చేర్చారు. అంతకుముందు బవుమా 46, డీకాక్ 8 రన్స్ చేసి ఔట్ అయ్యారు. RSA 30 ఓవర్లలో 197/3 చేసింది. అర్ష్దీప్, ప్రసిద్ధ్, హర్షిత్ తలో వికెట్ తీశారు.


