News April 11, 2024
రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల పెంపు!

TG: లోక్సభ ఎన్నికల కోసం రాష్ట్రంలో 450 పోలింగ్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయాలని ఈసీ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు 3 లక్షల మంది ఓటర్లు పెరిగారు. ఈ నేపథ్యంలో కేంద్రాల సంఖ్యను 35,356 నుంచి 35,806కు పెంచాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అనుమతి కోరుతూ ECIకి రాష్ట్ర సీఈవో వికాస్ రాజ్ ప్రతిపాదనలు పంపారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 3.31 కోట్ల మంది ఓటర్లున్నారు.
Similar News
News November 16, 2025
మరోసారి బిహార్ CMగా నితీశ్!

జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మరోసారి బిహార్ CMగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 19 లేదా 20న ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. PM మోదీ షెడ్యూల్ బట్టి తుది తేదీ నిర్ణయించనున్నారు. 89 సీట్లు గెలిచిన బీజేపీకి 15/16, 85 స్థానాల్లో విజయం సాధించిన JDUకు 14, లోక్ జన్శక్తి పార్టీకి 3 చొప్పున మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. కాగా నితీశ్ ఇప్పటివరకు 9 సార్లు CMగా ప్రమాణం చేశారు. 20 ఏళ్లు పదవిలో ఉన్నారు.
News November 16, 2025
పొద్దుతిరుగుడు సాగు – విత్తన శుద్ధితో మేలు

ఏ పంటకైనా చీడపీడల ముప్పు తగ్గాలంటే విత్తే ముందు విత్తనశుద్ధి తప్పకుండా చేయాలి. పొద్దుతిరుగుడు పంటకు నెక్రోసిస్ వైరస్ తెగులు సమస్యను అధిగమించడానికి కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సామ్ లేదా 5ml ఇమిడాక్లోప్రిడ్తో విత్తనశుద్ధి చేయాలి. అలాగే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 గ్రా. ఇప్రోడియాన్ 25%+కార్బండాజిమ్ 25%తో విత్తనశుద్ధి చేసుకుంటే మంచిది.
News November 16, 2025
లంచ్: 10కే 2 వికెట్లు డౌన్

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా తడబడుతోంది. లంచ్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 10 రన్స్ చేసింది. భారత్ విజయానికి మరో 114 రన్స్ అవసరం. క్రీజులో సుందర్, జురేల్ ఉన్నారు. జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచారు.


