News May 23, 2024

నాకు, నా కుటుంబానికి భద్రత పెంచండి: పులివర్తి నాని

image

టీడీపీ నేత పులివర్తి నానిపై ఈ నెల 14న జరిగిన దాడి కేసులో ఆయన్ను పోలీసులు తాజాగా విచారించారు. భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘు, భానుకుమార్ తనపై హత్యాయత్నం చేశారని నాని వారికి తెలిపారు. ‘అసలు నిందితుల్ని పోలీసులు వదిలేశారు. 70మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. నాకు, నా కుటుంబానికి భద్రతను మరింత పెంచాలి. రీపోలింగ్‌ అవసరం లేదు. కౌంటింగ్ సరిగ్గా జరిగేలా అధికారులు చూడాలి’ అని కోరారు.

Similar News

News December 10, 2025

మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ

image

ఉక్రెయిన్‌లో మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. అయితే యుద్ధ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలంటే మిత్రదేశాల నుంచి భద్రత, సహకారం అవసరమని చెప్పారు. మరోవైపు ప్రతిపక్షం కూడా ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అభిప్రాయపడుతోంది.

News December 10, 2025

దేశంలో పెరిగిన అమ్మాయిల సగటు వివాహ వయస్సు

image

దేశంలో బాలికల సగటు వివాహ వయస్సు 22.9 సంవత్సరాలకు చేరుకుందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో అమ్మాయిల సగటు వివాహ వయస్సు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో బాలికల వివాహ వయస్సు సగటున 22.1 సంవత్సరాలుగా ఉంది. ఇది 2020లో 22.7కి పెరిగింది. 2021లో ఇది 22.5 కాగా, 2022లో ఇది 22.7కి చేరుకుంది.

News December 10, 2025

ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ

image

భారత పర్యటనలో మెస్సీ పలు ప్రాంతాలను చుట్టేయనున్నారు. ఈ నెల 13న కోల్‌కతాలో అడుగుపెట్టనున్న ఆయన సాయంత్రం HYD వస్తారు. 14న ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే ఫ్యాషన్ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేస్తారు. 15వ తేదీ ఢిల్లీ చేరుకొని PM మోదీతో భేటీ అవుతారు. కాగా తొలిరోజు కోల్‌కతాలో తన అతిపెద్ద(70 అడుగుల) విగ్రహాన్ని మెస్సీ ఆవిష్కరించాల్సి ఉన్నా సెక్యూరిటీ కారణాలతో ఆ ప్రోగ్రామ్‌ను వర్చువల్‌గా నిర్వహిస్తున్నారు.