News October 3, 2024
పెరిగిన సిమెంట్ ధరలు

తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో ఇవాళ సిమెంట్ రేట్లను పలు కంపెనీలు పెంచాయి. 50 కేజీల బస్తాపై రూ.10-30 పెంచుతున్నట్లు ప్రకటించాయి. వాటిలో అల్ట్రాటెక్ సిమెంట్, దాల్మియా, రామ్‌కో, ACC, అంబుజా, చెట్టినాడ్, సాగర్, NCL ఇండస్ట్రీస్, ఇండియా సిమెంట్స్ తదితర సంస్థలున్నాయి. పెరిగిన ముడిసరకుల ఖర్చులకు అనుగుణంగా రేట్లు పెంచినట్లు తెలిపాయి. దీనివల్ల నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగాలపై ప్రభావం పడనుంది.
Similar News
News November 23, 2025
GHMC: సీసీ రోడ్ల పెండింగ్.. ఈ 3 జోన్లలో అధికం

ఖైరతాబాద్ జోన్‌లో మొత్తం 506 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విలువ రూ.14,042.7 లక్షలు. 27 BT రోడ్ల పనుల్లో కేవలం 4 మాత్రమే పూర్తయ్యాయి!చార్మినార్ జోన్‌లో 728 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. విలువ రూ.13,556.93 లక్షలు. ఇక్కడ కూడా CC పనుల బకాయి రూ.12,778.78 లక్షలుగా ఉంది. LBనగర్ జోన్‌లో రూ.11,446.4 లక్షల విలువైన 175 పనులు మిగిలి ఉన్నాయి. <<18363545>>ఈ మూడు జోన్లలో<<>>ని రోడ్ల సమస్యలపై ప్రజాగ్రహం తప్పేలా లేదు.
News November 23, 2025
DEC నెలాఖరుకు రాష్ట్రంలో గుంతల్లేని రోడ్లు: చంద్రబాబు

AP: డిసెంబర్ నెలాఖరుకు రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు దర్శనమివ్వాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. R&B రహదారుల అభివృద్ధిపై ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. రోడ్ల అభివృద్ధి, మరమ్మతులను ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని మంత్రి, స్పెషల్ సీఎస్‌లను ఆదేశించారు. పనులు చేపట్టని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏడాదిలోనే రూ.2500 కోట్లతో 5,471KM రోడ్ల అభివృద్ధికి అనుమతులిచ్చామన్నారు.
News November 22, 2025
టెర్రర్ మాడ్యూల్.. మరో కీలక నిందితుడి అరెస్ట్

ఢిల్లీ పేలుడు-టెర్రర్ మాడ్యూల్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. పుల్వామాలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే తుఫైల్ అహ్మద్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరో కీలక నిందితుడు డా.ముజఫర్ ఆగస్టులోనే దేశం విడిచి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడు అఫ్గాన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అరెస్టైన డాక్టర్లకు, జైషే మహ్మద్ హ్యాండర్లకు అతడే మధ్యవర్తిత్వం వహించినట్లు భావిస్తున్నారు.


