News November 22, 2024
పెరిగిన చలి.. విజృంభిస్తున్న జలుబు, దగ్గు
TG: రాష్ట్రంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో చాలామంది వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. ప్రతి 20 మందిలో ఐదుగురికి జలుబు, దగ్గు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి వల్ల జ్వరం కూడా వస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. బ్లడ్ టెస్టులు చేయించుకుంటున్నారు. మరోవైపు చలి వల్ల హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పొల్యూషన్ విపరీతంగా పెరగడంతో శ్వాసకోశ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Similar News
News November 22, 2024
నడ్డా లేఖలో అన్నీ అబద్ధాలే: జైరామ్ రమేశ్
మణిపుర్ వివాదంపై ఖర్గేకు JP నడ్డా రాసిన <<14675488>>లేఖ<<>>లో అన్నీ అబద్ధాలే ఉన్నాయని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ విమర్శించారు. అందులో DENIAL, DISTORTION, DISTRACTION, DEFAMATIONతో కూడిన ‘4D ఎక్సర్సైజ్’ మాత్రమే ఉందని వివరించారు. ‘రాష్ట్రానికి PM ఎప్పుడొస్తారు? మెజార్టీ MLAలు వ్యతిరేకిస్తున్నా CM ఎందుకు కొనసాగుతున్నారు? వైఫల్యాలకు అమిత్ షా ఎప్పుడు బాధ్యత తీసుకుంటారు’ అని మణిపుర్ ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు.
News November 22, 2024
డిసెంబర్ నుంచి పెన్షన్ల పెంపు?
TG: వచ్చే నెల 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి కానుంది. ఆలోగా ఆసరా పెన్షన్ల పెంపు, రైతు భరోసా పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం ఆసరా పింఛన్లకు ₹2,016, దివ్యాంగ పింఛన్లకు ₹3,016 ఇవ్వగా, తాము ఆసరా పింఛను ₹4,000, దివ్యాంగ పింఛన్ ₹6,000 చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రైతు భరోసా కింద ఏటా ఎకరాకు ₹15,000 అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
News November 22, 2024
శాసనమండలిలో మాటల యుద్ధం
AP: శాసనమండలిలో EBC రిజర్వేషన్లపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. గత ప్రభుత్వ DBT విధానం వల్ల చాలామంది గంజాయి బారినపడ్డారని మంత్రి సవిత అన్నారని, ఆమె ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇరుపక్షాలు వాదనకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, రికార్డుల నుంచి వాటిని తొలగిస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.