News March 18, 2025
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామి వారి దర్శనానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 70,824 మంది భక్తులు దర్శించుకోగా 25,674 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు సమకూరింది.
Similar News
News November 22, 2025
సిరిసిల్ల: TG డయాగ్నోస్టిక్ సెంటర్ను తనిఖీ చేసిన DMHO

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్, తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రక్త నమూనాలను, రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. వ్యాధులను అరికట్టడంలో జిల్లాను అగ్రస్థానంలో ఉంచాలని సిబ్బందికి సూచించారు. వ్యాధి నిరోధక టీకాలపై చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.
News November 22, 2025
మహిళలకు ₹లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి

TG: మహిళలకు ఏటా వడ్డీలేని రుణాల కింద ₹20వేల కోట్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని Dy CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటి వరకు ₹27వేల CR అందించామని, 5 ఏళ్లలో ₹లక్ష CR ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.15 CR కుటుంబాలుంటే అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి పథకాలతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.
News November 22, 2025
సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి: ముర్ము

AP: విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని పేర్కొన్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని తెలిపారు. ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, ఆయన సందేశంతో అనేక మందిని సేవామార్గంలో నడిపించారన్నారు.


