News April 4, 2025
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 58,864 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వేసవి సెలవుల నేపథ్యంలో కొండపై భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది.
Similar News
News April 5, 2025
టాప్‌లోనే కొనసాగుతోన్న PBKS

ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో పంజాబ్ కింగ్స్ టాప్‌లోనే కొనసాగుతోంది. మరోవైపు పట్టికలో అట్టడుగున సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఆ తర్వాత RCB, KKR, LSG, MI, CSK, RR, SRH ఉన్నాయి. ఇవాళ రెండు మ్యాచులు ఉండటంతో టేబుల్లో మార్పులు జరిగే ఛాన్స్ ఉంది.
News April 5, 2025
దాడులు ఆపకపోతే బందీల ప్రాణాలకే ముప్పు: హమాస్

గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే తమ వద్ద ఉన్న బందీల ప్రాణాలకే ప్రమాదమని హమాస్ తెలిపింది. తాము ఇజ్రాయెల్‌కు బందీలను అప్పగించే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ఇజ్రాయెల్ ఆర్మీ పాలస్తీనియన్లను గాజా నుంచి బలవంతంగా ఇక్కడి నుంచి తరలిస్తోందని ఆరోపించింది. కాగా గాజాలో ఇంకా 59 మంది ఇజ్రాయెలీ బందీలు ఉన్నట్లు ఆ దేశం ప్రకటించింది. వారిని కాపాడేందుకు గాజాలో గ్రౌండ్ అఫెన్సివ్ ప్రారంభించింది.
News April 5, 2025
రిషభ్ పంత్ మళ్లీ ఫెయిల్

LSG కెప్టెన్ రిషభ్ పంత్ మరోసారి బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. వరుసగా నాలుగో మ్యాచులోనూ ఆయన సత్తా చాటలేకపోయారు. ముంబైతో మ్యాచులో 2 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచారు. 4 మ్యాచుల్లో కలిపి పంత్ 19 పరుగులే చేశారు. దీంతో ఆయనపై SMలో మాజీలు, విశ్లేషకులు, క్రికెట్ ప్రేమికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాగా IPL మెగా వేలంలో పంత్ రూ.27 కోట్లు పలికి ఖరీదైన ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే.