News November 1, 2024

పెరిగిన సిలిండర్ ధర

image

దీపావళి తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రజలకు షాక్ ఇచ్చాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.61 మేర పెంచాయి. దీంతో ప్రస్తుతం HYDలో కమర్షియల్ LPG ధర రూ.2,028కి చేరింది. నేటి నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. మరోవైపు 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ప్రతినెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తాయి.

Similar News

News November 1, 2024

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

image

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టీబీసీ కౌంటర్ వరకు భక్తులు క్యూలైన్‌లో ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 63987 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.2.66 కోట్లు లభించింది.

News November 1, 2024

కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ

image

ఏపీలో నవంబర్ నెల పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నారు.
మొత్తం 64.14 లక్షల మంది లబ్ధిదారులుండగా ఇప్పటి వరకు 29.83 లక్షల మందికి పింఛన్లు అందించారు. పలు కారణాలతో ఇవాళ పెన్షన్ అందుకోలేని వారికి రేపు అందించనున్నారు. ఇటు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించేందుకు ఇవాళ CM చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు.

News November 1, 2024

IPL రిటెన్షన్లలో బ్యాటర్లదే పైచేయి

image

నిన్న IPL రిటెన్షన్ల ప్రక్రియ హాట్‌హాట్‌గా సాగింది. ఈ రిటెన్ష‌న్‌లో ఫ్రాంచైజీలు ఎక్కువగా బ్యాటర్లనే రిటైన్ చేసుకున్నాయి. మొత్తం 28 మంది బ్యాటర్లు రిటైన్ కాగా బౌలర్లు కేవలం 11 మంది రిటైన్ అయ్యారు. ఇక ఆల్‌రౌండర్ల విషయానికి వస్తే ఏడుగురిని ఆయా జట్లు తమతో అట్టిపెట్టుకున్నాయి. అత్యధిక ధర కూడా బ్యాటర్లకే పలికిన విషయం తెలిసిందే.