News October 3, 2024
పెరిగిన Gold Loans డామినేషన్
FY25 ఫస్ట్ క్వార్టర్లో NBFCలు పర్సనల్ లోన్లతో పోలిస్తే గోల్డ్ లోన్లనే ఎక్కువగా సాంక్షన్ చేశాయని FIDC తెలిపింది. ఇవి YoY 26% పెరిగి రూ.79,218 కోట్లకు చేరాయంది. గత ఏడాది రూ.63,495 కోట్లతో పర్సనల్ లోన్లే టాప్‌లో ఉన్నాయి. అన్ సెక్యూర్డ్ లోన్లపై RBI గత నవంబర్లో వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడవి రెండో స్థానానికి చేరాయి. హౌసింగ్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Similar News
News January 3, 2025
ఏపీని జగన్ భ్రష్టు పట్టించారు: అచ్చెన్నాయుడు
AP: రాష్ట్రాన్ని వైఎస్ జగన్ భ్రష్టు పట్టించారని మంత్రి అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందన్నారు. కేంద్రం సహకారంతో ఆక్సిజన్ అందినట్లు తెలిపారు. మత్స్యకారులకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అన్ని హామీలు నెరవేర్చాకే ఎన్నికలకు వెళ్తామన్నారు. రాష్ట్ర సంపద ఉద్యోగుల జీతాలకే సరిపోవడం లేదని చెప్పారు. అయినా మత్స్యకారులను ఆదుకుంటామని పేర్కొన్నారు.
News January 3, 2025
దున్నపోతుపై పెట్రోలింగ్ నిర్వహిస్తోన్న పోలీసులు
అత్యాధునిక వాహనాలు, గుర్రాలను వినియోగిస్తూ పోలీసులు గస్తీ కాయడం చూస్తుంటాం. అయితే, బ్రెజిల్‌లో కొందరు మిలిటరీ సైనికులు దున్నపోతులపై సవారీ చేస్తూ పెట్రోలింగ్ నిర్వహిస్తారు. వీటిని తడిసిన బురద నేలలో అనుమానితులను వెంబడించేందుకు, మడ చిత్తడి నేలల గుండా వెళ్లడానికి, నదుల్లో ఈదేందుకు ఉపయోగిస్తారు. వర్షాకాలంలో విస్తారమైన ద్వీపం అంతటా నేరస్థులను వేటాడేందుకు ఏకైక మార్గం ఇవే అని పోలీసులు చెబుతున్నారు.
News January 3, 2025
USను లాఫింగ్ స్టాక్‌గా మార్చిన జోబైడెన్: ట్రంప్
US చరిత్రలోనే జోబైడెన్ వరస్ట్ ప్రెసిడెంట్ అని డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. సరిహద్దులను బలహీనపరిచారని ఆరోపించారు. ఫలితంగా అమెరికా ఒక డిజాస్టర్, లాఫింగ్ స్టాక్‌గా మారిందన్నారు. న్యూఇయర్ వేడుకల్లో టెర్రరిస్టు దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. FBI, CIA, DOJ ఇలాంటివి ఆపకుండా, అన్యాయంగా తనపై దాడికే సమయం వృథా చేశాయని పేర్కొన్నారు. అమెరికాలో రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం, ఇతర నేరాలు ఊహించలేనంత పెరిగాయన్నారు.