News September 1, 2024

పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

image

చమురు సంస్థలు గ్యాస్ ధరలు పెంచాయి. 19కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.39 పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1691.50కు చేరింది. హైదరాబాద్‌లో రూ.1935గా ఉంది. అటు గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.

Similar News

News November 18, 2025

X(ట్విటర్) డౌన్

image

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X(ట్విటర్) డౌన్ అయింది. ట్వీట్లు చేయలేకపోతున్నామని యూజర్లు ఇతర SM పేజీల్లో కామెంట్లు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే తరహా ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? COMMENT

News November 18, 2025

చలికి చర్మం పగులుతుందా?

image

చలి పెరగడంతో శరీరం పగిలి ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేసిన వెంటనే & పడుకునే ముందు మందపాటి, ఆయిల్ ఆధారిత మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాయండి. చలికాలంలో కూడా రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగితే చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్‌గా ఉంచవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి’ అని తెలిపారు.

News November 18, 2025

పాడి పశువులకు మేత, దాణా ఇలా అందిస్తే మంచిది(1/2)

image

పాడి పశువులకు వరిగడ్డి, చొప్పలాంటి ఎండు మేతతో పాటు తప్పనిసరిగా పచ్చిమేత ఉండాలి. పశువు శరీర బరువు, పాల మోతాదును అనుసరించి మేత అందిస్తే దాని పాల ఉత్పత్తి పెరుగుతుంది. పాడి పశువు ప్రతి 45 కిలోల శరీర బరువుకు 1-1.5 కిలోల ఎండు మేత, 3-5 కిలోల పచ్చిమేత తింటుంది. నాలుగు లీటర్ల లోపు పాలిచ్చే పశువులకు సాధారణంగా 4-5 కిలోల ఎండుగడ్డి, 1-1.5 కిలోల దాణా మిశ్రమం సరిపోతుంది. ఎక్కువగా ఇచ్చి వృథా చేయకూడదు.