News April 8, 2025
పెరిగిన గ్యాస్ ధరలు

దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి. 14.2KGల గృహ వినియోగ సిలిండర్‌పై ₹50 పెంచుతున్నట్లు కేంద్రం నిన్న ప్రకటించగా, ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఉజ్వల పథకం సిలిండర్ ధర ₹503 నుంచి ₹533కు చేరింది. APలోని విజయవాడలో ₹825గా ఉన్న సిలిండర్ ధర ₹875 అయ్యింది. HYDలో ₹855గా ఉన్న ధర రూ.905కు చేరింది. సిలిండర్ కోసం నిన్నటి వరకూ ఆన్లైన్లో చెల్లింపులు చేసినా డెలివరీ ఇవాళ వస్తే మిగతా రూ.50 కూడా చెల్లించాలి.
Similar News
News April 8, 2025
వేసవి సెలవుల్లోనూ ఇంటర్ క్లాసులు

TG: సెలవుల్లో క్లాసులు నిర్వహించొద్దన్న ఇంటర్ బోర్డు ఆదేశాలను ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు యథేచ్చగా ఉల్లంఘిస్తున్నాయి. బ్రిడ్జి కోర్సు పేరుతో ఫస్టియర్ విద్యార్థులకు, ఐఐటీ, నీట్ అంటూ సెకండియర్ విద్యార్థులకు సెలవుల్లోనూ క్లాసులు నిర్వహిస్తున్నాయి. దీంతో ఇంటర్ బోర్డు అధికారులు తనిఖీ చేయట్లేదనే విమర్శలు వస్తున్నాయి. కాగా మార్చి 30తో పరీక్షలు ముగియగా, జూన్ 1 వరకూ ఇంటర్ విద్యార్థులకు సెలవులు ఇచ్చారు.
News April 8, 2025
SA స్టార్ ప్లేయర్ క్లాసెన్‌కు షాక్

సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు క్లాసెన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు(CSA) షాకిచ్చింది. బోర్డ్ విడుదల చేసిన 18మంది ఆటగాళ్ల 2025-26 కాంట్రాక్ట్ లిస్ట్‌లో క్లాసెన్ పేరు లేదు. ఇది ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు ICC ఈవెంట్స్, కీలక సిరీస్‌ల్లో పాల్గొనేలా మిల్లర్, డసెన్‌కు హైబ్రిడ్ కాంట్రాక్ట్ కల్పించింది. కాగా SRH స్టార్ ప్లేయర్ క్లాసెన్‌పై IPL తర్వాత CSA తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
News April 8, 2025
ఏపీలో రూ.80 వేల కోట్లతో పెట్రోలియం రిఫైనరీ: కేంద్రమంత్రి

ఏపీలో రూ.80 వేల కోట్లతో పెట్రోలియం రిఫైనరీ పరిశ్రమ రాబోతున్నట్లు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఏపీ, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు పెట్రోలియం రంగంలో పెట్టుబడులు ఆకర్షించడంలో ముందున్నాయన్నారు. గతంలో 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేవాళ్లమని, ఇప్పుడు ఆ సంఖ్య 40 దేశాలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.