News October 29, 2024
పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?

హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ.650 పెరిగి రూ.80,450కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రూ.600 పెరిగి రూ.73,750 పలుకుతోంది.
Similar News
News January 8, 2026
ప్రెగ్నెన్సీలో కాళ్లు వాపు వస్తున్నాయా?

ప్రెగ్నెన్సీలో కాళ్లవాపులు రావడాన్ని వైద్య పరిభాషలో జెస్టెషనల్ ఎడిమా అంటారు. గర్భిణిలలో ఏడో నెల నుంచి కాళ్లవాపు సాధారణంగా కనిపిస్తుంది. గర్భసంచి, బేబీ బరువుతో కొన్నిసార్లు కాళ్లవాపు వస్తుంది. గర్భిణుల్లో రక్త హీనత ఉన్నా, రక్తపోటు పెరిగినప్పుడు కాళ్లలో వాపు వస్తుంది. ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకున్నపుడు కూడా కొన్నిసార్లు కాళ్లవాపు కనిపిస్తుంది. సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
News January 8, 2026
ప్రతి విషయానికి బాధ పడుతున్నారా?

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ‖
విచారించకూడని విషయాల గురించి బాధపడటం సమయాన్ని వృథా చేసుకోవడమే! నిజమైన జ్ఞానులు పోయిన వారి గురించి కానీ, ఉన్న వారి గురించి కానీ, లేదా జరిగిపోయిన విషయాల గురించి కానీ అస్సలు శోకించరు. అనవసరమైన ఆలోచనలతో మెదడును సందిగ్ధంలో పడేయకుండా ఏది శాశ్వతమో తెలుసుకుని స్థితప్రజ్ఞతతో ఉండటమే అసలైన పరిష్కారం. <<-se>>#MSBP<<>>
News January 8, 2026
సంక్రాంతికి ఈ రూట్లో స్పెషల్ రైళ్లు

సంక్రాంతి రద్దీ దృష్ట్యా బెంగళూరు కంటోన్మెంట్, కలబురగి మధ్య స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) ప్రకటించింది. ఈనెల 10 నుంచి మార్చి 1 వరకు రానుపోను 16 సర్వీసులు (ట్రైన్ నం.06207/06208) ఉంటాయని వెల్లడించింది. యెలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, ఆదోని, మంత్రాలయం, రాయిచూర్, కృష్ణా, యాద్గిర్, వాడి, షాహాబాద్ స్టేషన్లలో ఈ ట్రైన్లు ఆగుతాయని తెలిపింది.


