News August 26, 2025

పెరిగిన గోల్డ్ రేట్స్

image

నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 పెరిగి రూ.1,02,060కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.500 ఎగబాకి రూ.93,550 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,30,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News August 26, 2025

గణేశ్ ఉత్సవాలు ఇలా మొదలయ్యాయి!

image

పశ్చిమ భారతదేశంలో స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ప్రజలను ఏకం చేసేందుకు బాల గంగాధర్ తిలక్ 1893లో గణేశ్ చతుర్థి వేడుకలను నిర్వహించారు. ప్రజలందరూ కలిసి జరుపుకునే ఓ సామాజిక ఉత్సవంగా మార్చారు. మతపరమైన వేడుకను ప్రజలందరూ కలిసి నిర్వహించడం ద్వారా వారికి ఏకత్వాన్ని, దేశభక్తిని గుర్తు చేశారు. ఆంగ్లేయులు రాజకీయ సమావేశాలను నిషేధించడంతో ఈ ఉత్సవాల ద్వారా జాతీయవాద ప్రసంగాలతో తిలక్ స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపారు.

News August 26, 2025

అభివృద్ధిని అడ్డుకుంటామంటే మీ ఇష్టం: RRR

image

AP: ప.గో. జిల్లా నూతన కలెక్టరేట్ నిర్మాణంపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అన్నారు. ‘భీమవరంలో కట్టకుండా ఉండి తరలిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. కలెక్టరేట్ నిర్మాణానికి భీమవరంలో సరిపడా స్థలం అందుబాటులో లేదు. ఈ నిర్మాణంతో వ్యక్తిగతంగా నాకు ఏ లబ్ధి జరగదు. ఈ నిర్మాణానికి ప్రాసెస్ పూర్తయింది. దీన్ని ఆపి అభివృద్ధిని అడ్డుకుంటామంటే మీ ఇష్టం’ అని తెలిపారు.

News August 26, 2025

బిహార్ ఎన్నికలకు ముందే బీజేపీకి కొత్త చీఫ్!

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించాలని BJP అధిష్ఠానం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 2020 నుంచి JP నడ్డా ఈ పదవిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తదుపరి అధ్యక్షుడి ఎంపికకు ఇప్పటికే కొంతమందిని షార్ట్‌లిస్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక తర్వాత జాతీయ, పలు రాష్ట్రాల అధ్యక్షుల నియామక ప్రక్రియ తిరిగి స్టార్ట్ అవుతుందని పేర్కొన్నాయి.