News April 1, 2025
పెరిగిన ఔషధాల ధరలు

దాదాపు 900 రకాల ఔషధాల ధరలను ఇవాళ్టి నుంచి గరిష్ఠంగా 1.74% మేర పెంచినట్లు NPPA వెల్లడించింది. ఇందులో యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, గుండె జబ్బులు, షుగర్ మెడిసిన్స్ ఉన్నాయి. సవరించిన ధరల ప్రకారం అజిత్రోమైసిస్ 250Mg ఒక్కో టాబ్లెట్ రేటు ₹11.87, 500Mg ధర ₹23.97కు చేరింది. డైక్లోఫెనాక్ ₹2.09, ఇబ్రూఫెన్ 200Mg ₹0.72, 400Mg ₹1.22గా పేర్కొంది. పూర్తి లిస్టును https://www.nppaindia.nic.in/లో చూడొచ్చు.
Similar News
News November 20, 2025
రైతులకు అండగా ఉండటం మా బాధ్యత: లోకేశ్

AP: సాగు తీరు మారాలి.. అన్నదాత బతుకు బాగుపడాలన్నదే తమ సంకల్పమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. “ఇవాళ 46.85 లక్షల మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ-PM కిసాన్’ కింద 2విడతల్లో కలిపి రూ.14 వేలు చొప్పున జమ చేశాం. అలాగే CM చంద్రబాబు వ్యవసాయాభివృద్ధికి పంచసూత్రాలు ప్రకటించారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ సాయం వంటి మార్గదర్శకాలు సూచించారు” అని ట్వీట్ చేశారు.
News November 20, 2025
శబరిమల: చిన్నారుల ట్రాకింగ్కు ‘Vi బ్యాండ్’

శబరిమలలో చిన్నారులు తప్పిపోకుండా వొడాఫోన్-ఐడియా(Vi)తో కలిసి కేరళ పోలీసులు ‘సురక్ష బ్యాండ్’లను తీసుకొచ్చారు. చిన్న పిల్లలతో శబరిమల వెళ్లే భక్తులు Vi సెక్యూరిటీ కియోస్కుల వద్ద, కేరళలోని అన్ని Vi స్టోర్లలో ఈ సురక్ష బ్యాండ్లను పొందొచ్చు. ఆన్లైన్లో కూడా వీటికోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రతి బ్యాండ్కు ఒక స్పెషల్ డిజిటల్ కోడ్ ఉంటుంది. ఒకవేళ పిల్లలు తప్పిపోతే వారిని దీని సాయంతో ట్రాక్ చేయొచ్చు.
News November 19, 2025
రాష్ట్రపతి ప్రశ్నలు.. రేపు అభిప్రాయం చెప్పనున్న SC

బిల్లుల ఆమోదం, సమయపాలన అంశాలకు <<17597268>>సంబంధించి <<>>రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము లేవనెత్తిన 14 ప్రశ్నలపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం రేపు అభిప్రాయాన్ని వెల్లడించనుంది. తమిళనాడు సర్కారు వేసిన పిటిషన్ విచారణలో బిల్లుల ఆమోదానికి గవర్నర్, రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. దీనిపై న్యాయసలహా కోరుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టుకు ముర్ము 14 ప్రశ్నలు వేశారు.


