News October 10, 2024
పల్లెల్లో పెరిగిన టెలికం వినియోగం
టెలికం కంపెనీల ఆదాయం జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి 8% పెరిగినట్లు ట్రాయ్ వెల్లడించింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే నెలవారి సగటు ఆదాయం రూ.157.45గా ఉంది. గత మార్చికి ఇది రూ.153.54గా ఉంది. టెలికం రంగం స్థూల ఆదాయం 0.13% పెరిగి రూ.70,555 కోట్లుగా ఉంది. పల్లెల్లో టెలికం వినియోగం 59.19% నుంచి 59.65%కి పెరగ్గా, పట్టణాల్లో 133.72% నుంచి 133.46%కి తగ్గింది. టెలిఫోన్ చందాదారుల సంఖ్య 1205.64 మిలియన్లుగా ఉంది.
Similar News
News January 3, 2025
రైతులకు రూ.20,000.. ఎప్పుడంటే?
AP: అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతులకు ఏడాదికి రూ.20,000 చొప్పున సాయం చేసే ఈ పథకాన్ని PM కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు అమలు చేయాలని నిర్ణయించింది. PM కిసాన్‌ను ₹6వేల నుంచి కేంద్రం ₹10వేలకు పెంచనుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం ₹10వేలు కలిపి మొత్తం ₹20వేలు ఇస్తామని CM CBN చెప్పారు. 3 విడతల్లో కేంద్రం ఎంత ఇస్తుందో రాష్ట్రమూ అంతే మొత్తంలో ఇవ్వనుంది.
News January 3, 2025
జియో రూ.40,000 కోట్ల IPO
రిలయన్స్ జియో IPOకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా రూ.40,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే జరిగితే స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద IPOగా రిలయన్స్ జియో పేరు నిలిచిపోతుంది. ఇందుకోసం సంస్థ విలువను రూ.10లక్షల కోట్లుగా చూపించనున్నట్లు తెలుస్తోంది. మే/జూన్ తర్వాత ఈ IPO మార్కెట్లోకి వచ్చే ఛాన్సుంది.
News January 3, 2025
BREAKING: కష్టాల్లో భారత్
ఆసీస్‌తో జరుగుతున్న 5వ టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. 72 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయింది. లంచ్ బ్రేక్‌కు మూడు వికెట్లు పడగా, ఆ తర్వాత బోలాండ్ బౌలింగ్‌లో ఎప్పటిలాగే కోహ్లీ(17) స్లిప్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఫ్ సైడ్ వెళ్లే బంతిని అనవసర షాట్‌కు యత్నించి విరాట్ వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో పంత్(9), జడేజా(0) ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 76/4.