News July 18, 2024
తిరుమలలో పెరిగిన రద్దీ.. 31 కంపార్టుమెంట్లలో భక్తులు
AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 69,029 మంది భక్తులు దర్శించుకోగా 28,547 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.2.90 కోట్లు సమకూరింది.
Similar News
News January 22, 2025
తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో ఈ విచారణ జరగనుంది. ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల 8న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం జరిగిన ఈ తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు.
News January 22, 2025
త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు: మంత్రి సీతక్క
TG: సర్పంచ్ ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. బీసీ కమిషన్ రిపోర్టు దాదాపుగా పూర్తయిందని, సీఎం రేవంత్ దావోస్ నుంచి వచ్చాక ఆ రిపోర్టును ఆమోదిస్తారని తెలిపారు. పథకాల లబ్ధిదారులను గ్రామ సభల ద్వారానే ఎంపిక చేస్తున్నామని, 96% గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు.
News January 22, 2025
‘గోల్డ్ రా మన తమన్ అన్న’
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నెటిజన్లు అడిగే ప్రశ్నలకు రిప్లై ఇస్తుంటారు. తాజాగా ఓ యువకుడు తన బాధను తమన్ దృష్టికి తీసుకెళ్లగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తాను ఓ రిథమ్ ప్యాడ్ ప్లేయర్ అని, అది పాడైపోయిందని చెప్పడంతో కొత్తది కొనిస్తానని హామీ ఇచ్చారు. వివరాలు చెప్పాలని కోరారు. దీంతో తమన్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. తమన్ గోల్డ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.