News April 7, 2024

పెరిగిపోతున్న నోటా ఓట్లు.. ప్రభావం శూన్యం?

image

దేశంలో నిర్వహిస్తున్న ఏ ఎన్నికల్లోనైనా నోటా ఓట్లు పెరిగిపోతున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 60,00,197 ఓట్లు నోటాకు పోలయ్యాయి. 2019లో ఈ సంఖ్య 65,22,772కి చేరింది. ఈ విధానాన్ని NOTA (నన్ ఆఫ్ ద ఎబౌ) పేరుతో 2013లో అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే నోటా అనేది రాజకీయ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపట్లేదని, ఇది కోరల్లేని పాములా తయారైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. <<-se>>#Election2024<<>>

Similar News

News December 12, 2025

భూముల్లో సూక్ష్మపోషక లోపాలు.. కారణం ఏమిటి?

image

తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో జింకు, ఇనుము, బోరాన్ లోపం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము, మాంగనీసు లోపం.. నీరు నిలిచే లోతట్టు భూములు, మురుగు నీరు పోని భూములు, అన్నివేళలా నీరు పెట్టే వరి పొలాల్లో జింక్ లోపం వచ్చే అవకాశం ఎక్కువ. సాగు నీటిలో కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేలలో సున్నం పాళ్లు ఎక్కువైనప్పుడు ఇనుపదాతు లోపం కనిపిస్తోంది.

News December 12, 2025

భారత్ భారీ స్కోర్

image

మెన్స్ U-19 ఆసియా కప్-2025లో భారత జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. UAEతో మ్యాచులో 50 ఓవర్లలో 433-6 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ 171 రన్స్‌తో ఊచకోత కోశారు. ఆరోన్ జార్జ్ 69, విహాన్ మల్హోత్రా 69 పరుగులతో అదరగొట్టారు.

News December 12, 2025

హ్యాపెనింగ్ సిటీగా విశాఖ అభివృద్ధి: CBN

image

AP: అత్యంత హ్యాపెనింగ్ సిటీగా విశాఖ అభివృద్ధి చెందుతుందని CM CBN ఆకాంక్షించారు. తూర్పునావికాదళ కేంద్రంగా, టూరిజమ్ హబ్‌గా ఉన్న విశాఖ ఇప్పుడు ఐటీ, ఏఐ, టెక్నాలజీ, నాలెడ్జ్ సిటీగా మారుతోందని అభివర్ణించారు. కాగ్నిజెంట్ సహా 8 సంస్థలకు భూమి పూజచేశామని, ఏడాదిలో 25వేల మందికి అవకాశాలు వచ్చి ఇక్కడినుంచి పనిచేయగలుగుతారని చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుందని, మెట్రో కూడా వస్తుందని చెప్పారు.