News January 30, 2025
టీనేజ్ అమ్మాయిల్లో పెరుగుతున్న ప్రెగ్నెన్సీలు

Social Media కంటెంట్కు ఆకర్షితులవుతూ పిన్నవయస్సులోనే రిలేషన్షిప్ వల్ల టీనేజ్ యువతుల్లో ప్రెగ్నెన్సీ ధోరణి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటకలో 2021-22, 2023-24 మధ్య 33,621 మంది టీనేజర్స్ గర్భం దాల్చినట్టు లెక్కలు చెబుతున్నాయి. సామాజిక పరిస్థితులు, Internet, Social Media ప్రభావం, కుటుంబ అస్థిరత, సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం కూడా ఈ ధోరణి పెరగడానికి కారణమని చెబుతున్నారు.
Similar News
News October 18, 2025
నేడు ఇలా చేస్తే సకల శుభాలు

నేడు ధన త్రయోదశి పర్వదినం. ఈరోజున ధన్వంతరి, లక్ష్మీదేవి, కుబేరుడు, వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు చెబుతున్నారు. ‘ఈ శుభ దినాన బంగారం, వెండి, లోహ పాత్రలు, కొత్తిమీర, కొత్త చీపురు కొనడం శుభప్రదం. ప్రధాన ద్వారం వద్ద యముడికి దీపాన్ని దానం చేయడం ద్వారా అకాల మృత్యు భయం తొలగుతుంది. తెల్లని వస్తువులు దానం చేస్తే లక్ష్మీ, కుబేరుల అనుగ్రహం లభించి, సంపద వర్షిస్తుంది’ అని పేర్కొంటున్నారు.
News October 18, 2025
నేడు ఉద్యోగ సంఘాలతో చర్చలు

AP: నేడు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో కీలక చర్చలు జరగనున్నాయి. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో మంత్రుల బృందం వారితో సమావేశంకానుంది. పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు, జీపీఎఫ్, పీఎఫ్ సమస్యలు, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధిత సమస్యలపై చర్చించనున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సీఎస్ విజయానంద్ ఈ భేటీలో పాల్గొంటారు.
News October 18, 2025
భారత్కు ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీ!

ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని భారత్కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ అభ్యర్థన మేరకు అతడిని అరెస్టు చేయడం సరైందేనని అట్వర్ప్లోని న్యాయస్థానం పేర్కొంది. అయితే అతడికి హైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నా అతడిని ఇండియాకి తీసుకురావడంలో ఇది కీలక అడుగుగా చెప్పొచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13 వేల కోట్లు ఎగవేసి ఛోక్సీ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.