News February 6, 2026

INDతో మ్యాచును బాయ్‌కాట్ చేస్తే పాక్‌కే దెబ్బ!

image

T20 WCలో భారత్‌తో మ్యాచును బాయ్‌కాట్ చేస్తే పాకిస్థాన్‌కు గ్రూప్ స్టేజ్ దాటడమే కష్టంగా మారొచ్చు. ఈ మ్యాచ్ ఆడకపోతే గ్రూప్‌లోని మిగతా జట్లపై(USA, నమీబియా, నెదర్లాండ్స్) కచ్చితంగా గెలవాలి. లేదంటే NRRపై ఆధారపడాల్సి వస్తుంది. 2024 WCలో PAKను USA ఓడించింది. దీంతో ఈసారీ ఆ టీమ్ నుంచి పాక్‌కు ముప్పు ఉంది. ఈ నేపథ్యంలో INDతో మ్యాచ్ ఆడితేనే గెలుపు కోసం ప్రయత్నించేందుకు PAKకు మరో అవకాశం(మ్యాచ్) ఉంటుంది.

Similar News

News February 16, 2026

28,740 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే ఆఖరు

image

పోస్టాఫీసుల్లో 28,740 బీపీఎం, GDS, ఏబీపీఎం ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లు 5PM వరకు అప్లై చేసేందుకు అవకాశం ఉంది. APలో 1,060, TGలో 608 పోస్టులు ఉన్నాయి. టెన్త్ పాసై, 18-40 ఏళ్ల వయసున్న వారు అర్హులు. టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎగ్జామ్ ఉండదు. పోస్టును బట్టి రూ.10వేల నుంచి రూ.29,380గా శాలరీ ఉంది.
సైట్: https://indiapostgdsonline.gov.in/

News February 16, 2026

నేడు అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన

image

AP: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ నేడు అమరావతికి రానున్నారు. సచివాలయంలో CM చంద్రబాబు, DyCM పవన్ కళ్యాణ్‌, మంత్రి లోకేశ్‌తో ఆయన భేటీ కానున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కొనసాగుతున్న విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల ప్రాజెక్టులను విస్తరించడంపై చర్చలు జరపనున్నారని సమాచారం. రియల్‌టైమ్ గవర్నెన్స్ సెంటర్, సంజీవని ప్రాజెక్ట్, టెక్నాలజీ ఆధారిత వ్యవసాయ విధానాలను ఆయన పరిశీలించనున్నారు.

News February 16, 2026

ఉపవాస విరమణ ఏ సమయంలో చేయాలంటే?

image

నిన్నటి శివరాత్రి ఉపవాసాన్ని ఈరోజు సూర్యోదయం తర్వాత విరమించాలి. దీనినే ‘పారణ’ అంటారు. చతుర్దశి తిథి ముగిసేలోపు ఉపవాసం విరమించాలి. అందుకు 6.42AM – 3.10PM అనువైన సమయమని పండితులు చెబుతున్నారు. ‘స్నానాది కార్యక్రమాలు ముగించుకుని శివదర్శనం చేసాక ఆహారం తీసుకోవాలి. రాత్రంతా జాగరణ చేసిన వారు పారణ తర్వాత నిద్రపోవాలి. క్రమశిక్షణతో ఉపవాసం వదిలితే శివానుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్య ఫలం లభిస్తుంది’ అంటున్నారు.