News February 28, 2026
IND-EU మధ్య మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా!

ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(FTA) కుదుర్చుకొన్న <<18973975>>భారత్-ఈయూ<<>> మరో అడుగు ముందుకేశాయి. ఈ డీల్ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఐదేళ్లపాటు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాను ఇచ్చుకునేందుకు అంగీకరించాయి. దీని ప్రకారం IND లేదా EU వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(WTO) దేశాలతో మెరుగైన డీల్ చేసుకుంటే.. దాన్ని ఈ రెండు దేశాలకూ వర్తింపజేసుకుంటాయి. కాగా India-EU ట్రేడ్ డీల్‌ను ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణిస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News March 1, 2026
ఖమేనీ చనిపోయారు.. ఆయన బాడీ దొరికింది: ఇజ్రాయెల్ అధికారి

ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ చనిపోయారని ఇజ్రాయెల్ అధికారి ధ్రువీకరించినట్లు రైటర్స్ సంస్థ వెల్లడించింది. ఆయన బాడీని కూడా గుర్తించినట్లు ఆ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖమేనీ మృతదేహానికి సంబంధించిన ఆధారాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుకు అధికారులు చూపించినట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంటోంది. కాగా ఖమేనీ క్షేమంగానే ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ చెబుతూ వస్తోంది.
News March 1, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 1)

* 1901: ఆంధ్రరాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య జననం
* 1951: బిహారీ సీఎం నితీశ్ కుమార్ జననం (ఫొటోలో)
* 1955: తెలుగు భాషావేత్త వెలమల సిమ్మన్న జననం
* 1986: సింగర్ ఎన్.సీ.కారుణ్య జననం
* 1989: మహారాష్ట్ర మాజీ సీఎం వసంత్‌దాదా పాటిల్ మరణం
* ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం
* జీరో డిస్క్రిమినేషన్ డే
News March 1, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


