News November 14, 2024

WI, IREతో IND జట్టు ఢీ.. షెడ్యూల్ విడుదల

image

వెస్టిండీస్, ఐర్లాండ్‌తో భారత మహిళల జట్టు స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ రిలీజ్ చేసింది. డిసెంబర్ 15 నుంచి 27 వరకు వెస్టిండీస్‌తో 3టీ20లు నవీ ముంబైలో, 3 వన్డేలు బరోడాలో జరగనున్నాయి. 2025 జనవరి 10 నుంచి ఐర్లాండ్‌తో రాజ్‌కోట్ వేదికగా మూడు వన్డేల సిరీస్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.

Similar News

News December 12, 2025

INDvsSA.. 5 పరుగులు, 5 వికెట్లు

image

SAతో రెండో టీ20లో IND 162 పరుగులకు ఆలౌటై 51 రన్స్ తేడాతో <<18539012>>ఓడింది<<>>. చివరి 5 వికెట్లను 5 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. 8 బంతుల్లో 5 వికెట్లు పడ్డాయి. 157 రన్స్ వద్ద 6, 158 వద్ద 7, 162 వద్ద 8, 9, పదో వికెట్ పడింది. అభిషేక్(17), గిల్(0), SKY(5), తొలి టీ20లో అదరగొట్టిన హార్దిక్ (23 బంతుల్లో 20) స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడం, స్పిన్నర్లను బాగా ఆడే దూబేను 8వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం INDను దెబ్బతీసింది.

News December 12, 2025

ప్రెగ్నెన్సీకి ముందు ఏ టెస్టులు చేయించుకోవాలంటే..

image

ప్రతి మహిళ ప్రెగ్నెంట్ అయ్యే ముందు కొన్ని ఆరోగ్య పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాలంటున్నారు నిపుణులు. వాటిల్లో ముఖ్యమైనవి రూబెల్లా, చికెన్ పాక్స్, HIV, హెర్సస్, హెపటైటిస్ B, థైరాయిడ్, జన్యు పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. వీటితో పాటు గవదబిళ్లలు, మీజిల్స్, రుబెల్లా టీకాలు కచ్చితంగా తీసుకోవాలి. అలాగే మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి మెంటల్ హెల్త్ చెకప్ కచ్చితంగా చేయించుకోవాలని సూచిస్తున్నారు.

News December 12, 2025

బల్మెర్ లారీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>బల్మెర్ లారీ<<>> 18 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 4వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MTM, MBA, BE/B.Tech, డిగ్రీ, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.balmerlawrie.com