News September 29, 2024

IND vs BAN: మూడో రోజూ వర్షార్పణమే

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. మైదానం ఇంకా చిత్తడిగా ఉండటంతో అంపైర్లు ఆటను నిలిపేశారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. కాగా ఇవాళ ఉదయం నుంచీ వర్షం కురవకపోయినా మైదానం చిత్తడిగానే ఉంది. అంపైర్లు రెండు సార్లు ఇన్‌స్పెక్షన్ చేసి ఆట నిర్వహణకు అనువుగా లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Similar News

News September 29, 2024

1130 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

image

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో ఫైర్ విభాగంలో 1130 కానిస్టేబుల్ తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 30తో గడువు ముగుస్తోంది. ఇంటర్ పూర్తి చేసి, 18-23 ఏళ్ల లోపు వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. ఎంపికైతే జీతం రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది. వెబ్‌సైట్ లింక్: https://cisfrectt.cisf.gov.in/

News September 29, 2024

కొత్త NCA ప్రత్యేకతలు ఇవే

image

బెంగళూరులో సకల సౌకర్యాలతో బీసీసీఐ కొత్త ఎన్‌సీఏను రూపొందించింది. దాదాపు 40 ఎకరాల్లో 3 మైదానాలు సిద్ధం చేశారు. వీటిలో ఇన్‌డోర్, ఔట్‌డోర్ కలిపి ఏకంగా 86 పిచ్‌లు ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్ సైజ్ స్విమ్మింగ్‌పూల్, 80 మంది కూర్చునే కాన్ఫరెన్స్ రూమ్, స్పా, స్టీమ్ బాత్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. అత్యాధునిక ఫిజియోథెరపీ జిమ్, స్పోర్ట్స్, సైన్స్, మెడిసిన్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. త్వరలో దీనిని ప్రారంభిస్తారు.

News September 29, 2024

రిలయన్స్@ రోజుకు రూ.216 కోట్ల ఆదాయం

image

FY2024లో ఆయా కంపెనీలు ప్రకటించిన ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ల ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా రోజుకు ₹216 కోట్ల లాభం ఆర్జిస్తోంది. ఆ తర్వాత వరుసగా SBI(₹187 కోట్లు), HDFC బ్యాంక్(₹179 కోట్లు), ONGC(₹156 కోట్లు), TCS(₹126 కోట్లు), ICICI బ్యాంక్(₹123 కోట్లు), IOC(₹118 కోట్లు), LIC(₹112 కోట్లు), కోల్ ఇండియా (₹102 కోట్లు), టాటా మోటార్స్(₹87 కోట్లు) ఉన్నాయి.