News June 25, 2024
IND vs ENG: సెమీఫైనల్కు వరుణ గండం?

టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఈనెల 27న జరిగే సెమీఫైనల్లో ఇండియా, ఇంగ్లండ్ తలపడనున్నాయి. కాగా మ్యాచ్ జరిగే రోజు గయానాలో భారీ వర్షం కురవనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు 89 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా ఒకవేళ మ్యాచ్ రద్దయితే గ్రూప్-1లో టాప్ ప్లేస్లో ఉన్న టీమ్ ఇండియా ఫైనల్కు వెళ్తుంది. రిజర్వ్ డే లేకపోవడం భారత్కు కలిసిరానుంది.
Similar News
News December 20, 2025
జనవరి నెలాఖరులోగా విశాఖకు TCS!

AP: ప్రముఖ IT సంస్థ TCS ఈ జనవరి నెలాఖరులోగా విశాఖలో ఏర్పాటు కానుంది. తొలుత 2 వేల మందితో తమ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఆపరేషన్స్ ప్రారంభించిన రోజే శాశ్వత భవనానికి శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2027 చివరి నాటికి శాశ్వత క్యాంపస్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. TCS క్యాంపస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రుషికొండ ఐటీ పార్కులోని హిల్-3పై ఎకరానికి 99 పైసల చొప్పున 21.6 ఎకరాలను కేటాయించింది.
News December 20, 2025
దైవమే పాటించిన ధర్మం

శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోడానికి కుబేరుడి వద్ద అప్పు తీసుకున్నాడు. లోక నాయకుడైనప్పటికీ భూలోక నియమాలు పాటించి, పత్రం రాసిచ్చి, కలియుగాంతం వరకు వడ్డీ చెల్లిస్తానని మాటిచ్చారు. నేటికీ భక్తుల కానుకల రూపంలో ఆ రుణాన్ని తీరుస్తున్నారు. మనం ఎంత గొప్పవారమైనా సమాజ నియమాలను గౌరవించాలని, తీసుకున్న అప్పును బాధ్యతగా తిరిగి చెల్లించాలని, కష్టకాలంలో సాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత ఉండాలని తెలుపుతుంది.
News December 20, 2025
అపరాల పంటల్లో బంగారు తీగ కలుపు నివారణ

అపరాల పంటలకు బంగారు తీగ కలుపు ముప్పు ఎక్కువ. అందుకే పంట విత్తిన వెంటనే ఎకరాకు 200L నీటిలో పెండిమిథాలిన్ 30% 1.25 లీటర్లను కలిపి పిచికారీ చేయాలి. వరి మాగాణిలో మినుము విత్తితే వరి పనలు తీసిన వెంటనే ఎకరాకు 1.25L పెండిమిథాలిన్ 30%ను 20KGల ఇసుకలో కలిపి పొలంలో చల్లాలి. అలాగే మినుము విత్తిన 20 రోజులకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాఫిర్ 10% 200mlను కలిపి పిచికారీ చేసి బంగారు తీగ కలుపును నివారించవచ్చు.


