News June 27, 2024
IND vs ENG: ఫైనల్ చేరేదెవరో?

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ జరగనుంది. గయానాలోని డారెన్ సామి స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. T20WC-2022 సెమీఫైనల్ ఓటమికి ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు బట్లర్ సేన అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉండి టీమ్ ఇండియాకు సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 6, 2026
‘God is good’.. అమెరికాను వణికించిన SOS

ఇరాన్‌లో కూలిన F-15Eలోని పైలట్ రెస్క్యూ కోసం చేపట్టిన ఆపరేషన్‌కు ముందు అమెరికన్ నిఘా వర్గాలకు ఊహించని పరిణామం ఎదురైంది. పైలట్ నుంచి వచ్చిన ‘God is good’ అనే అత్యవసర మెసేజ్(SOS) వారిని భయపెట్టింది. అది ఇరాన్ పన్నిన వల అయ్యుండొచ్చని.. వెళ్తే ఒక్కసారిగా దాడిచేసే ప్రమాదం ఉందని భావించారు. చివరకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో పైలట్ లొకేషన్, ఆయన స్థితిని తెలుసుకొని రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టి రక్షించారు.
News April 6, 2026
ట్రంప్: ముందు బెదిరింపు.. తర్వాత పొడిగింపు!

ఇరాన్‌తో యుద్ధంపై US అధ్యక్షుడు ట్రంప్ రోజుకో తీరున ప్రకటన చేస్తూ నవ్వులపాలవుతున్నారు. డీల్ చేసుకోవాలని డెడ్‌లైన్ విధించడం, తర్వాత పొడిగించడం మామూలైపోయింది. మార్చి 21 నుంచి 5సార్లు ఇలానే చేశారు. 48 గంటల్లో హార్ముజ్‌ను తెరవకపోతే <<19577288>>విధ్వంసం<<>> చేస్తామని ప్రకటించి మరుసటి రోజే గడువును 82 గంటలకు పొడిగించామని చెప్పారు. ఆయన డెడ్‌లైన్లు ఆయిల్ ధరల కంటే వేగంగా మారుతున్నాయని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
News April 6, 2026
IPL: చెన్నై పని అయిపోయిందా?

అన్ని జట్లపై ఆధిపత్యం చెలాయిస్తూ 5 టైటిల్స్ గెలిచిన చెన్నై.. ఇప్పుడు వరుస ఓటములతో తుస్సుమంటోంది. 200+ టార్గెట్‌ను కాపాడుకోవాలన్నా, 200కు పైగా ఛేజ్ చేయాల్సి ఉన్నా చేతులెత్తేస్తోంది. టీమ్ బ్యాలెన్స్ సరిగా లేదని, బౌలర్లు తేలిపోతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ధోనీ వస్తే పరిస్థితి మారుతుందని కొందరు అంటున్నారు. జట్టు బాగాలేనప్పుడు ఎవరు వచ్చినా ఏమీ చేయలేరని మరికొందరు కౌంటర్ ఇస్తున్నారు. COMMENT?


