News March 9, 2025
IND VS NZ: హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి!

హైదరాబాద్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫీవర్ నడుస్తోంది. భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్‌పై మరింత ఉత్కంఠ పెరిగింది. జనాలు మొత్తం టీవీలకు అతుక్కుపోయారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్ల మీద జనసంచారం తగ్గింది. సిటీలోని అన్ని ఎలక్ట్రానిక్ స్టోర్లలోని LED టీవీల్లో మ్యాచ్ ప్రదర్శించగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ క్రీజులో ఉండడంతో మరింత ఆసక్తిగా నగరవాసులు వీక్షిస్తున్నారు.
Similar News
News September 18, 2025
HYD: బతుకమ్మ, దసరా కోసం ప్రత్యేక బస్సులు

బతుకమ్మ, దసరాకు ప్రయాణికుల కోసం TGSRTC 7,754 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. MGBS, JBS, CBS, KPHB, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు నడపనున్నట్లు TGSRTC ప్రకటించింది.
News September 18, 2025
HYD: క్షీణించిన అశోక్ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు

HYDలో నిరుద్యోగ సమితి నాయకులు అశోక్ ఆమరణ నిరాహార దీక్ష 4 రోజులుగా చేస్తుండగా ఆరోగ్యంగా క్షీణించింది. దీంతో ఆయనను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లుగా బృందాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు తన ఆమరణ నిరాహార దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు.
News September 18, 2025
HYD: అర్జున్ గల్లంతు.. వలిగొండలో డెడ్‌బాడీ లభ్యం

అఫ్జల్‌సాగర్ నాలాలో <<17748449>>4రోజుల<<>> క్రితం గల్లంతైన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. యాదాద్రి జిల్లా వలిగొండ సమీపంలో మూసీ నదిలో అర్జున్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కడసారి చూసేందుకు పిల్లాపాపలతో అక్కడికి బయలుదేరారు. మరో వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.