News March 9, 2025

IND VS NZ: హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి!

image

హైదరాబాద్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫీవర్ నడుస్తోంది. భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్‌పై మరింత ఉత్కంఠ పెరిగింది. జనాలు మొత్తం టీవీలకు అతుక్కుపోయారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్ల మీద జనసంచారం తగ్గింది. సిటీలోని అన్ని ఎలక్ట్రానిక్ స్టోర్‌లలోని LED టీవీల్లో మ్యాచ్‌ ప్రదర్శించగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ క్రీజులో ఉండడంతో‌ మరింత ఆసక్తిగా నగరవాసులు వీక్షిస్తున్నారు.

Similar News

News March 21, 2025

HYDలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

image

హజ్రత్ అలీ వర్ధంతి సందర్భంగా నేడు చార్మినార్ నుంచి మస్జిద్-ఇ-ఇమామియా వరకు జరిగే ఊరేగింపు కారణంగా మ. 2:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని HYD ట్రాఫిక్ జాయింట్ సీపీ తెలిపారు. నయాపూల్, చట్టాబజార్, పురాణిహవేలి, దారులషిఫా గ్రౌండ్స్, ఎస్జే రోటరీ, దబీర్‌పురా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ప్రయాణికులు ట్రాఫిక్ అప్డేట్స్‌ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలని సూచించారు.

News March 21, 2025

HYD: ఓయూ సర్కులర్‌పై హైకోర్టు స్టే

image

ఓయూ జారీ చేసిన సర్క్యులర్ మీద హైకోర్ట్ స్టే ఇచ్చింది. ఓయూ పరిధిలో ధర్నాలు, నిరసనలు బ్యాన్ చేస్తూ ఓయూ అధికారులు ఈ నెల 13వ తేదిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధమని రఫీ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఓయూ రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.

News March 21, 2025

ఉస్మానియా యూనివర్సిటీ బీసీఏ పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీసీఏ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల మూడవ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.

error: Content is protected !!