News October 24, 2024

IND Vs NZ.. రసవత్తర పోరుకు సిద్ధం

image

భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు రెండో టెస్ట్‌కు రంగం సిద్ధమైంది. పుణే వేదికగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ప్రతికూల పిచ్‌తో ఓటమి పాలైన భారత్ బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. పూర్తిగా స్పిన్‌కు అనుకూలించే పిచ్ రూపొందించింది. బ్యాటింగ్‌లో గిల్ రాకతో ఎవరిని తప్పిస్తారనేది ప్రశ్నార్థకం. సిరాజ్‌కు బదులు ఆకాశ్‌దీప్‌ను తీసుకునే అవకాశముంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.

Similar News

News November 25, 2025

టెంపుల్ కారిడార్ నిర్మాణానికి రూ.380 కోట్లు: TPCC ఛీఫ్

image

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, లింబాద్రిగుట్ట, బాసరను కలుపుతూ టెంపుల్ కారిడార్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.380 కోట్లు మంజూరు చేసింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ధర్మపురిలో ప్రారంభమై కొండగట్టు, వేములవాడ, భీమ్‌గల్ మీదుగా బాసర వరకు ఈ కారిడార్ నిర్మిస్తారని ఆయన ప్రకటించారు.

News November 25, 2025

పిల్లలు నూడుల్స్, పాస్తా తింటే కలిగే నష్టాలు తెలుసా?

image

రిఫైన్డ్ ఫ్లోర్‌తో తయారు చేసే నూడుల్స్, పాస్తా తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఉండే అధిక సోడియంతో పిల్లల్లో బీపీ, గుండె, కిడ్నీ సమస్యలు వస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరిగి డయాబెటిస్, హై కొలెస్ట్రాల్‌కు దారితీస్తుంది. ప్రొటీన్స్, విటమిన్స్, ఫైబర్ తక్కువగా ఉండడంతో ఒబెసిటీ, పోషకాహార లోపం ఏర్పడుతుంది. జీర్ణక్రియ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

News November 25, 2025

జుబీన్ గార్గ్‌ను హత్య చేశారు: సీఎం హిమంత

image

ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం CM హిమంత బిశ్వశర్మ సంచలన ప్రకటన చేశారు. ఆయన ప్రమాదవశాత్తు చనిపోలేదని, హత్యకు గురయ్యారని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. 52 ఏళ్ల జుబీన్ ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తు మరణించినట్లు వార్తలొచ్చాయి. దీనిపై తొలి నుంచీ ఆయన కుటుంబం అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది. ఈక్రమంలోనే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.