News October 17, 2024

IND vs NZ : నేడైనా వరుణుడు కరుణించేనా!

image

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ఆట టాస్ కూడా పడకుండానే రద్దు అయ్యింది. ఇవాళ కూడా బెంగళూరులో వర్షం పడే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వరుణుడు కరుణిస్తే మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ 15 నిమిషాల ముందే ఆట ప్రారంభించాలని అంపైర్లు నిర్ణయించారు. ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు కొనసాగనుంది.

Similar News

News October 17, 2024

అమరావతిలో రూ.49వేల కోట్ల పనులకు త్వరలో టెండర్లు: నారాయణ

image

AP: అమరావతి పనులను 20 రోజుల్లో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రూ.49వేల కోట్ల విలువైన పనులకు జనవరిలోగా టెండర్లు పిలుస్తామన్నారు. మౌలిక వసతులు, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, HODల కార్యాలయాల నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. MLAలు, MLCలు, IASల భవనాల నిర్మాణానికి రూ.524 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. 2 నెలల్లో వరల్డ్ బ్యాంక్ రూ.15వేల కోట్ల రుణం మంజూరు చేస్తుందన్నారు.

News October 17, 2024

నేడు ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

image

AP: రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో నేడు పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో సెలవు మంజూరు చేశారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కలెక్టర్లు హాలిడే ప్రకటించినా విద్యాసంస్థలు నడపటంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News October 17, 2024

BREAKING: తీరం దాటిన వాయుగుండం.. భారీ వర్షాలు

image

AP: తిరుపతి జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 22 KM వేగంతో తీరాన్ని చేరినట్లు పేర్కొంది. ఈ సమయంలో భారీ ఈదురుగాలులు వీచినట్లు తెలిపింది. ప్రస్తుతం వాయుగుండం అల్పపీడనంగా బలహీన పడుతోందని పేర్కొంది. కాగా దీని ప్రభావంతో ప్రస్తుతం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.