News March 9, 2025

IND VS NZ: హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి!

image

హైదరాబాద్‌లో ఛాంపియన్‌షిప్ ఫీవర్ నడుస్తోంది. భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్‌పై మరింత ఉత్కంఠ పెరిగింది. జనాలు మొత్తం టీవీలకు అతుక్కుపోయారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్ల మీద జనసంచారం తగ్గింది. సిటీలోని అన్ని ఎలక్ట్రానిక్ స్టోర్‌లలోని LED టీవీల్లో మ్యాచ్‌ ప్రదర్శించగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ క్రీజులో ఉండడంతో‌ మరింత ఆసక్తిగా నగరవాసులు వీక్షిస్తున్నారు.

Similar News

News March 10, 2025

మల్యాల: మిస్సింగ్ అయిన మహిళ మృతి

image

మిస్సింగ్ అయిన ఓ మహిళ మృతదేహం ఎస్సారెస్పీ కెనాల్‌లో లభ్యమైంది. ఎస్ఐ నరేశ్ కుమార్ కథనం మేరకు.. మల్యాల మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన జైసేట్టి వెంకవ్వ(50) ఈ నెల 6న రాత్రి 11 గంటల నుంచి కనిపించకుండా పోయిందని భర్త గంగన్న ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆదివారం జగిత్యాల మండలం అంతర్గాం శివారులోని ఎస్సారెస్పీ కెనాల్‌లో వెంకవ్వ మృతి చెంది కనిపించింది.

News March 10, 2025

రేపు పరిగి పట్టణంలో జాబ్ మేళా

image

రేపు పరిగి పట్టణంలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు డీసీసీ కార్యదర్శి పెంటయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం పరిగిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వికారాబాద్ జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని వెల్లడించారు.

News March 10, 2025

నేడు గ్రూప్-1 రిజల్ట్

image

TG: నేడు గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించనుంది. ఈ మేరకు ప్రొవిజనల్ మార్కుల జాబితాను రిలీజ్ చేయనుంది. మొత్తం 563 పోస్టులకు‌గానూ గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక రేపు గ్రూప్-2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, 14న గ్రూప్-3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేయనున్నారు.

error: Content is protected !!