News February 24, 2025

IND vs PAK మ్యాచ్@ 60 కోట్ల వ్యూస్

image

CT-2025లో భాగంగా భారత్, పాక్ మధ్య నిన్న జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్ వ్యూస్ పరంగా నంబర్-1గా నిలిచింది. జియో‌హాట్‌స్టార్‌లో దాయాదుల పోరుకు 60.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. పాకిస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సమయంలో 6.8కోట్లు ఉన్న వ్యూస్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసి మ్యాచ్‌ను గెలిపించే సమయానికి 60.5కోట్లకు చేరి రికార్డ్ సృష్టించింది. గతంలో ఏ క్రికెట్ మ్యాచ్‌కూ ఇన్ని వ్యూస్ రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు.

Similar News

News February 24, 2025

ఆ మందులపై నిషేధం విధించిన డీసీజీఐ

image

పెయిన్ కిల్లర్లుగా ఉపయోగించే టపెంటడాల్, కారిసొప్రాడల్ మందుల మిశ్రమ ఉత్పత్తి, ఎగుమతులను నిషేధిస్తూ డీసీజీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైకి చెందిన ఓ సంస్థ ఆమోదం లేని మందుల్ని తయారు చేసి పశ్చిమాఫ్రికాకు ఎగుమతి చేస్తోందనే కథనాల ఆధారంగా తక్షణమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ కాంబినేషన్లో ఉత్పత్తి చేసేందుకు ఇచ్చిన లైసెన్స్‌లు, NOCని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

News February 24, 2025

రేపు పులివెందులకు YS జగన్

image

AP: మాజీ సీఎం, YCP అధినేత వైఎస్ జగన్ రేపు పులివెందుల వెళ్లనున్నారు. బుధవారం అక్కడ ‘ప్రజాదర్బార్’ నిర్వహించనున్నారు. గురువారం పులివెందులలో జరిగే LV ప్రసాద్ కంటి ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరవుతారు. అక్కడి నుంచి ఆయన బెంగళూరు వెళ్లే అవకాశం ఉందని YCP వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని YCP నిర్ణయం తీసుకోగా, జగన్ వెళ్లే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

News February 24, 2025

చరిత్ర సృష్టించిన కోహ్లీ

image

ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌పై సెంచరీతో చెలరేగి POTM పొందిన విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ICC ఈవెంట్లలో ఒకే జట్టుపై అత్యధిక(5) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఈ ఛేజ్ మాస్టర్ 2012 T20WC, 2015 ODI WC, 2016 T20WC, 2022 T20WC, 2025 CTలో దాయాదిపై POTM పొందారు. మరే ఇతర ప్లేయర్ ప్రత్యర్థి జట్టుపై 3 కంటే ఎక్కువ అవార్డులు సాధించకపోవడం గమనార్హం.

error: Content is protected !!